Nivetha Pethuraj : నా జీవితాన్ని నాశనం చేయకండి.. దండం పెడుతూ వేడుకున్న నివేతా.. కారణమిదే

- Advertisement -

Nivetha Pethuraj : ఇటీవల తమిళ మీడియాలో కొంతమంది నివేతా పేతురాజ్ పై నెగిటివ్ గా వార్తలు రాశారు. నివేతా పేతురాజ్ పై కొంతమంది డబ్బులు ఖర్చుపెడుతున్నారని అభ్యంతకర వార్తలు రాశారు. దీంతో నివేతా పేతురాజ్ అలాంటి వార్తలపై తన సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందిస్తూ ఫైర్ అయింది. నివేతా పేతురాజ్ తన ట్వీట్ లో..

Nivetha Pethuraj

‘‘ఇటీవల నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తప్పుడు వార్తలు రాసారు. మొదట నేను మౌనంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు రాసేవాళ్ళు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేముందు వాళ్ళు విన్న సమాచారం నిజమా కాదా అని ధృవీకరించడానికి మానవత్వం ఉంటుందని అనుకున్నాను. ఈ వార్తలతో కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు రాసే ముందు ఒకసారి ఆలోచించండి. నేను ఓ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను.

నేను 16 సంవత్సరాల నుండే సంపాదించడం మొదలుపెట్టాను. నా ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంటుంది. 20 ఏళ్లకు పైగా మేము దుబాయ్‌లోనే ఉన్నాము. సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు ఛాన్స్ ఇవ్వమని ఏ రోజు ఏ నిర్మాతను, డైరెక్టర్ ని, హీరోని అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను, అవన్నీ నా దగ్గరికి వచ్చిన అవకాశాలే. నేను డబ్బు కోసం అత్యాశ పడను. నా గురించి వచ్చిన వార్తలు అన్ని అబద్దాలే. మేము 2002 నుండి దుబాయ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాము.

- Advertisement -
Nivetha Pethuraj Photos

నేను చాలా సాధారణ లైఫ్ గడుపుతాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాతే నేను ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్లు కోరుకున్నట్టే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను. ఆ వార్తలు రాసేవాళ్ళల్లో కొంత మానవత్వం ఉందని, వాళ్ళు నన్ను ఇలా పరువు తీయడం మళ్ళీ చేయరని భావిస్తూ దీనిపై లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కుటుంబాల ప్రతిష్టని నాశనం చేసేముందు ఆ వార్తలు నిజమో కాదో తెలుసుకొని రాయండి. ఇకపై నన్ను బాధలకు గురిచేయకండి. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసినవారందరికి థ్యాంక్యూ’’ అంటూ పోస్ట్ చేసింది. దీంతో నివేతా పేతురాజ్ ట్వీట్ వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here