Allu Arjun : యంగ్ హీరో నితిన్ కి ఈమధ్య కాలం లో సరైన సక్సెస్ లేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రం ‘మాచెర్ల నియోజకవర్గం’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మాస్ ఇమేజి కోసం ట్రై చేసి చేతులు కాల్చుకున్న నితిన్, తనకి మంచి సక్సెస్ లను అందించిన ఎంటర్టైన్మెంట్ జానర్ ని మరోసారి ఎంచుకొని ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ అనే చిత్రం చేసాడు.
ఈ సినిమా వచ్చే నెల 8 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం నితిన్ కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని అందరికీ నమ్మకం కలిగించింది.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ భాగంగా, రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన పలు ఆసక్తికరమైన విషయాలకు ఆమె సమాధానం చెప్పింది. యాంకర్ అడుగుతూ ‘ఎవరైనా తమ ఫేవరెట్ హీరో పేరు ని కెరీర్ ప్రారంభం లో ఉపయోగించి, తర్వాత ఒక స్టేజి వచ్చాక మానేస్తారు. కానీ మీరు కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటికే వరకు మీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పేరుని వాడుకుంటూనే ఉన్నారు, చూసేవారికి ఇది చిరాకుగా అనిపిస్తుంది కదా’ అని అడుగుతుంది.
దానికి నితిన్ సమాధానం చెప్తూ ‘నేను అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. సిక్స్ కి ముందు ఒకలాగా ప్రవర్తించి, పైకి ఎదిగిన తర్వాత మరోలా వ్యవహరించడం నాకు అలవాటు లేదు’ అంటూ కామెంట్స్ చేసాడు. ఇది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పరోక్షంగా ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ని ప్రతీ సినిమాలో వాడుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం వేరేలాగా ప్రవర్తిస్తున్నాడని, ఆయన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.