Nithiin : చిత్ర పరిశ్రమలో ప్రేమలు,పెళ్ళిళ్ళు,డేటింగ్, ఎఫైర్స్ ఆ కనెక్షన్లు ఇలాంటివి కామన్.. ఎంత త్వరగా అన్నీ జరిగి పోతాయి..ఒకవేళ చివరి వరకూ కలిసి ఉంటాము అని అనుకుంటే మాత్రం పెళ్ళి చేసుకోని ఒకటవుతారు. లేకుంటే లైట్ తీసుకుంటారు.ఈ మధ్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న చాలా మంది విడాకుల వైపు తీసుకుంటూన్నారు. ఇక మరి కొంతమంది సెలబ్రిటీలు అయితే పెళ్లయి కొన్ని ఏళ్లు గడిచినా కూడా చిన్న చిన్న అభిప్రాయ బేధాలు రావడం వల్ల వారి పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ విడాకుల బాట పడుతున్నారు.

ఇది ఇలా ఉండగా..హీరో నితిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. ఇతను కూడా ప్రేమలో పడిన విషయం చాలా మందికి తెలియదు..కానీ మీరు విన్నది నిజం..సైలెంట్ గా కనిపించే నితిన్ కూడా లవ్ చేస్తాడా అనే సందేహం వస్తుంది..ఆ హీరోయిన్ చేసిన పనికి ఆ ప్రేమ విషయం చెప్పకుండా తనలోనే దాచుకున్నారట.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు నితిన్.
ఇక మొదటి సినిమానే బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈయనకు వరుసగా సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్న నితిన్ కి ఓ హీరోయిన్ మీద పిచ్చి ప్రేమ పెరిగిందట..అప్పటిలో ఆ హీరోయిన్ ను పెళ్ళి కూడా చేసుకొవాలని అనుకున్నాడట..ఆ హీరోయిన్ ఎవరు, ఎక్కడ పరిచయం ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

ఆ బ్యూటీ ఎవరో కాదు..ముద్దుగుమ్మ ఇలియానా..నితిన్ తొలి చూపులోనే చాలా ప్రాణంగా ప్రేమించాడట. అంతేకాదు ఈమె కోసమే రెచ్చిపో అనే సినిమాలో తన పాత్ర నచ్చకపోయినప్పటికీ ఒప్పుకున్నారట. అలా కొన్ని రోజులు ఆమెను ప్రేమించిన నితిన్ ఆమెకు ప్రేమ విషయం చెప్పకుండానే వన్ సైడ్ లవ్ కానించారు.. ఇక తన ప్రేమ విషయం బయట పెడదాం అనుకునే లోపే ఇలియానా వేరొకరితో లవ్ లో ఉందని తెలుసుకొని అక్కడితో తన ప్రేమను మనసులోనే చంపుకున్నాడు..

అదే నితిన్ లవ్ ఫెయిల్ అయింది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు నెట్టింట్లో చాలా వైరల్ అయ్యాయి. అంతేకాదు నితిన్ కి ఇలియానా అంటే ఇప్పటికి కూడా ప్రేమ అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా ఎన్నో వార్తలు వస్తుంటాయి.అయితే, ఇక నితిన్ శాలిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారిద్దరూ వారి వివాహ జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు..ఇక సినిమాల విషయానికొస్తే మాచర్ల నియోజకవర్గం సినిమా చేశారు.నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారో చూడాలి..