Ali : ఎంద చాట.. కాట్రవల్లి.. ఫ్లాంత్రఫగిడి.. ఆలీకి ఈ భాష ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..?



Ali : చైల్డ్ ఆర్టిస్ట్​గా కెరీర్​ను మొదలుపెట్టారు ఆలీ. ఆ తర్వాత కమెడియన్​గా, హీరోగా నటించారు. దాదాపు 1000కు పైగా సినిమాల్లో తనదైన నటనతో అలరించారు. పలురకాల షోస్ చేస్తూ ప్రతి ఇంట్లో సందడి చేశారు. అలా ఆలీతో సరదాగా అనే కార్యక్రమాన్ని ఏకంగా 300 ఎపిసోడ్లు నడిపించారు. 300 వారాలుగా ఈ షోతో ప్రేక్షకులను నవ్వించి.. కవ్వించిన ఆలీ ప్రస్తుతం ఈ షోకు కాస్త బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు. 300వ ఎపిసోడ్​తో షో ఎండ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే చివరి ఎపిసోడ్​కు ఆలీ తానే గెస్టుగా వచ్చారు.

Ali
Ali

299 ఎపిసోడ్లు నడిపించిన ఆలీ 300వ ఎపిసోడ్​కు మాత్రం తానే గెస్టుగా వచ్చారు. ఇన్నాళ్లూ గెస్టులను రోస్ట్ చేసిన ఆలీని ఈసారి యాంకర్ సుమ రోస్ట్ చేసింది. 300వ ఎపిసోడ్​కు గెస్ట్ హోస్టుగా వచ్చి ఆలీని గెస్టుగా మార్చి ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆలీతో చాలా విషయాలు చెప్పించింది సుమ. తన కెరీర్​ ఎలా స్టార్ట్ అయింది.. ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. కమెడియన్​గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎలా మారారు.. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎందుకు వచ్చారు.. పవన్ కల్యాణ్​తో గొడవ ఏంటి.. ఇలా ఆలీని చాలా రకాల ప్రశ్నలను అడిగారు సుమ. అయితే ఈ ప్రశ్నలన్నింటిలో చాలా ఇంట్రెస్టింగ్​గా అనిపించిన ఓ ప్రశ్న ఏంటంటే..?

Ali

వేయికి పైగా సినిమాల్లో నటించిన ఆలీ కెరీర్​లో కొన్ని పాత్రలు మాత్రం చాలా స్పెషల్. కొంతమంది డైరెక్టర్లయితే కేవలం ఆలీ కోసమే స్పెషల్ పాత్రలు సృష్టించే వారు. అలా ఆలీ కోసం క్రియేట్ చేసిన ఓ పాత్ర నచిమి. చిరుత మూవీలో ఈ పాత్ర చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇలా పాత్రలే కాదు ఆలీ తన కోసం తాను ఓ భాష కూడా సృష్టించుకున్నారు. కాట్రవల్లి.. ఫ్లాంత్రఫగిడి.. అంటూ చిత్రవిచిత్రమైన భాష మాట్లాడటం ఆలీకి మాత్రమే సాధ్యమైంది. అయితే ఈ షోలో సుమ ఆలీని ఈ భాష గురించే ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగింది. అసలు ఈ చాట భాష స్టోరీ ఏంటని అడిగింది. దానికి ఆలీ ఏం చెప్పారంటే..?

“ఎవరైనా తెలియని వ్యక్తి కనపడితే ‘బాబూ కాట్రే నీ పేరేంటి’ అని పిలిచేవాడిని. అలా దాన్ని వాడటం మొదలైంది. ఫ్లాంత్రఫగిడి అంటే పువ్వు అని అర్థం. జబ్బల్‌హాట్‌ రాజా.. అంటే చాలా పెద్ద మనసు ఉన్న వ్యక్తి. ఇలా మామూలుగా మాట్లాడటం కంటే ఇలాంటి పదాలు వాడి మాట్లాడటం నాకిష్టం. అలా అయితేనే మన మాటలకు కాస్త ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఇది నాకు నేనుగా నా కోసం సృష్టించిన భాష. కానీ ఇప్పుడు ఈ భాష చాలా ఫేమస్ అయింది. కుర్రాళ్లు కూడా దీన్ని తెగ వాడేస్తున్నారు.” అని అసలు సంగతి చెప్పుకొచ్చారు. ఇంకా ఈ షోలో ఆలీ తన ఫ్యామిలీ, కొత్త అల్లుడు గురించి కూడా చాలా విషయాలు చెప్పారు.

Tags: