Niharika : వాళ్లు నా వెంట్రుకతో సమానం.. మెగా డాటర్ నిహారిక బోల్డ్ కామెంట్స్

- Advertisement -

Niharika : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయింది. సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మించి సినిమాలు తీస్తూనే.. నటిగా మరికొన్ని సినిమాల్లో నటించడానికి ఓకే చేస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలకు అగ్రిమెంట్ కూడా చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా నిహారికనే వెల్లడించింది. అయితే నిహారిక ఓవైపు సినిమాల్లో నటీస్తున్నప్పటికీ మరోవైపు తన మీద వచ్చే రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక రూమర్ తనమీద పుట్టుకు వస్తూనే ఉంది.

నిహారిక ఎలాంటి విషయం మాట్లాడినా దాన్ని వైరల్ చేస్తూ ఎక్కడో ఒక దగ్గర పనిలేని వాళ్లు ఆమెపై వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు. అయితే విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో నిహారిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూలో నిహారిక ఎవడు ఏమనుకున్నా నా వెంట్రుకతో సమానం అంటూ మాట్లాడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి ఇంతకీ నిహారిక అంతలా మాట్లాడడానికి కారణం ఎవరో తెలుసుకుందాం.

- Advertisement -
niharika
niharika

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తనపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి గట్టిగా ఇచ్చిపడేసింది. ఆ ఇంటర్వ్యూలో నిహారికను ఎవరైనా మిమ్ముల్ని విమర్శిస్తే దానిని మీరు ఎలా తీసుకుంటారని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ఈ బ్యూటీ చాలా లైట్ తీసుకుంటాను. అవునా.. ఒకే ఒకే అనుకుంటాను. పొగిడితే పొంగిపోను, విమర్శిస్తే బాధపడనంటూ తెలిపింది. అలాగే చాలా ట్రోలింగ్ జరుగుతుందిగా.. మిమ్ముల్ని అతిగా విమర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటీ అని అడగ్గా.. నేను ఎవరి గురించి పట్టించుకోను, నాకు మా ఫ్యామిలీ, ఫాదర్, బ్రదర్, ఫ్రెండ్స్ అంతే. వీరే నా ప్రపంచం.. మిగితా వాళ్లు ఎవరు ఏం అనుకున్నా నా వెంట్రుకతో సమానం అన్నట్లు తన వెంట్రకులు చూపిస్తూ, ఏ ఫరాక్ పడదని ఇండైరెక్ట్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here