మెగా డాటర్ నిహారిక ఈ మధ్యకాలంలో అందాల రచ్చ చేస్తోంది. పెళ్లి తర్వాత గ్లామర్ తలపులు తెరుస్తూ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. పెళ్లి తర్వాత కొన్ని నెలలు సినిమాలకు, నటనకు బ్రేక్ ఇచ్చిన మెగా డాటర్.. తాజాగా ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘డెడ్ పిక్సెల్స్’లో ప్రధాన పాత్రలోనటించింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ కోసం ఓ రేంజ్ ప్రమోషన్స్ చేసిన నిహారిక.. ఇప్పుడు హాయిగా రిలాక్స్ అవుతోంది. వెకేషన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ చిల్ కావడమే కాకుండా ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనం నోళ్ళలో నానుతోంది నిహారిక. ఈ డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ కోసం ఓ రేంజ్ ప్రమోషన్స్ చేసిన నిహారిక.. ఇప్పుడు హాయిగా రిలాక్స్ అవుతోంది. వెకేషన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ చిల్ కావడమే కాకుండా ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జనం నోళ్ళలో నానుతోంది నిహారిక. ఈ క్రమంలోనే నిహారిక ఎలాగైనా హీరోయిన్ కావాలనే పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోన్న నిహారిక.. ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమా ఒక మనసు’ పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. చిరంజీవి హీరోగా ‘సైరా’ సినిమాలో బోయ పిల్ల పాత్రలో నటించింది నిహారిక. ప్రస్తుతం నిర్మాతగా పలు సీఎంఎంల నిర్మాణంలో భాగమవుతోంది నిహారిక.