Niharika ఇంత బరితెగించిందా?.. డేట్ అంటూ పోస్ట్.. వైరల్..

- Advertisement -

Niharika మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ఇప్పుడు ఎన్నో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తన భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే..మూడేళ్ల క్రితం నిహారిక జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. అప్పట్లో వీరి పెళ్లిని నాగబాబు అంగరంగ వైభవంగా జరిగించారు. అయితే ఇప్పుడు నిహారిక, చైతన్య మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. అవి పెరిగి పెరిగి విడాకుల వరకు వెళ్లాడని ప్రచరం జరుగుతోంది. అదే సమయంలో ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం, చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫోటోలు, నిహారికకు సంబంధించిన ఫోటోలన్నీ తొలగించడం వంటి అంశాలు నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది..

Niharika
Niharika

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు నిహారిక చేసిన మరో పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆసక్తికర పోస్ట్ లు పెట్టింది. తన స్నేహితురాలు స్నేహాతో కలసి కాఫీ డేట్ కి వెళ్లిన నిహారిక.. ఇందుకు సంబంధించిన పిక్ ను పంచుకుంటూ హాట్ డేలో హాట్ డేట్‌ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే మరొక పోస్ట్ లో హ్యాపీ బర్త్ డే శౌర్యువ్ గారు.. ఈ ఏడాది మీదే. మీ దర్శకత్వ ప్రతిభతో మమల్ని ఆశ్చర్యపరచడం ఖాయం అని కామెంట్ పెట్టింది.. బయట ఇంత జరుగుతున్నా కూడా ఆమె స్పందించక పోవడం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి..

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉందని మాత్రం తెలుస్తుంది.. అలాగే షూటింగ్ లొకేషన్ నుంచి ఒక పిక్ పోస్ట్ చేసింది. దీంతో అసలు శౌర్యువ్ ఎవరు అంటూ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఇంతకీ అతను మరెవరో కాదు.. న్యాచురల్ స్టార్ నాని 30వ చిత్రంతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది.. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.. ఇక నిహారికను నాగబాబు తన ఇంటికి తీసుకొని వచ్చినట్లు సమాచారం.. మరి విడాకుల విషయం పై ఎప్పుడు క్లారిటి ఇస్తారో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here