Niharika Konidela : మెగా బ్రదర్ నాగ బాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల పెద్ద సక్సెస్ కాలేకపోయింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా ఎలాగో సక్సెస్ కాలేదు, కనీసం నిర్మాతగా అయినా సక్సెస్ ని చూడాలని అనుకుంది. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లను నిర్మించింది కానీ, అవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నిర్మాతగా ఆమెకి నష్టాలను మిగిల్చింది.

ఇకపోతే వైవాహిక జీవితం కూడా అర్థాంతరంగా మధ్యలోనే ఆగిపోవడం మెగా ఫ్యాన్స్ కి బాధగా అనిపించింది. చైతన్య అనే వ్యక్తితో నిహారిక కొణిదెల పెళ్లిని నాగబాబు ఎంత అట్టహాసం గా జరిపాడో మనమంతా చూసాము. ఈ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అలా ట్రెండ్ అయ్యినంత కాలం కూడా వీళ్లిద్దరి దాంపత్య జీవితం కొనసాగకపోవడం విచారకరం. రీసెంట్ గా మొట్టమొదటిసారి నిహారిక కొణిదెల తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది.

ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘నా వైవాహిక జీవితం ఏడాదిలోపే ముగుస్తుందని అనుకోలేదు. ఎంతో భారీ ఖర్చు తో పెళ్లి చేసుకొని, వెంటనే విడిపోవాలని ఏ అమ్మాయి కూడా కోరుకోదు. కానీ నా జీవితం లో జరిగింది. ఈ సంఘటన కారణంగా ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దు అనే నీతిని నేర్చుకున్నాను. ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను ‘ అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.

ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నమ్మి మోసపోయాను అని అంటుంది కాబట్టి, చైతన్య నిహారిక ని మోసం చేశాడా?, వేరే అమ్మాయితో సీక్రెట్ రిలేషన్ పెట్టుకోవడం వల్లే నిహారిక అతనికి విడాకులు ఇచ్చిందా వంటి కామెంట్స్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది. దీనికి చైతన్య రియాక్షన్ ఇస్తాడో, లేకపోతే సైలెంట్ గా అలా ఉండిపోతాడో అనేది చూడాలి.
