Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన నిహారిక కొణిదెల ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమెకి పెళ్లి అవ్వడం, దురదృష్టం కొద్దీ వైవాహిక బంధానికి మధ్యలోనే తెంచేయడం వంటివి జరిగాయి. అయితే సినిమాల్లో నటించకపోయినప్పటికీ కూడా నిర్మాతగా ఇది వరకు ఆమె పలు వెబ్ సిరీస్ లు చేసింది. అవి కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆమె ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఆగస్టు 9 వ తారీఖున థియేటర్స్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కోసం నిహారిక ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటుంది.
అందులో భాగంగా ఆమె అనేక ఇంటర్వూస్ కూడా ఇచ్చింది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఇటీవలే నేను నా సొంత డబ్బులతో ఒక కొత్త ఇల్లు కొన్నాను. ఆ ఇంట్లో ఉన్న నన్ను కలవడానికి నా కజిన్స్ సాయి ధరమ్ తేజ్ , రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్ తో పాటు మా అన్నయ్య వరుణ్ తేజ్ కూడా వచ్చాడు. ఆరోజు కాసేపు నా సినిమా టెన్సన్స్ అన్నీ పక్కన పెట్టి ఒక రెండు గంటల పాటు నా కజిన్స్ తో సరదాగా గడిపాను. డమ్ సరాస్ ఆడడం అంటే మా అందరికీ ఇష్టం. చరణ్ అన్న చూసేందుకు చాలా సైలెంట్ గా ఉంటాడు, ఆయన గేమ్స్ ఆడడు అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు, చరణ్ అన్న అన్నీ గేమ్స్ ఆడుతాడు. ఆరోజు మాతో డమ్ సరాస్ కూడా ఆడాడు. చరణ్ అన్న ప్రతీ గేమ్ లోను చీటింగ్ చేసి గెలుస్తుంటాడు. ఆయన పెద్ద చీటర్’ అంటూ నిహారిక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇకపోతే నిహారిక కొణిదెల నిర్మించిన ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమా ద్వారా కొత్తవారు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలిసిన వారు ఈ సినిమాలో లేకపోవడం విశేషం. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయితే , కచ్చితంగా వీరందరికి మంచి అవకాశాలు వస్తాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.