Niharika Konidela : రీసెంట్ గానే విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు హయవాహిని దగ్గుపాటి ఆకాష్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. పెద్దగా హంగులు రబాటలు లేకుండా చాలా సింపుల్ గా, వెంకటేష్ మనసుకి బాగా దగ్గరైన కొంతమంది సినీ ప్రముఖులు మరియు బంధు మిత్రుల సమక్షం లో ఈ నిశ్చితార్ధ వేడుక విజయవాడ లో జరిగింది.

అయితే కొత్త అల్లుడు ఆకాష్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు గత కొంతకాలంగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటంటే ఆకాష్ ఇండియా లోనే టాప్ 10 ‘గైనకాలజిస్ట్స్’ లో ఒకరని. అతని నెల సంపాదన కోట్ల రూపాయిలలోనే ఉంటుందని, వెంకటేష్ ఏరికోరి సుమారుగా రెండేళ్ల పాటు అనేక పెళ్లి సంబంధాలు చూసి ఈ వివాహాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

ఇదంతా పక్కన పెడితే ఆకాష్ గురించి తెలిసిన మరో విషయం ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. అదేమిటంటే ఆకాష్ తొలుత మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ని పెళ్లి చేసుకోవాల్సి ఉందట. నిహారిక కి చైతన్య తో పెళ్ళికి ముందు నాగబాబు అనేక సంబంధాలు చూసాడు. అందులో ఆకాష్ కూడా ఉన్నాడట.

అంతా మాట్లాడుకొని ఓకే అనుకున్న తర్వాత ఎందుకో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల , వీళ్లిద్దరి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని ఒక రూమర్ ఉంది. ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యాక నిహారిక చైతన్య ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆమె చైతన్య కి కూడా విడాకులు ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. నిన్ననే ఆమె అన్నయ్య వరుణ్ తేజ్ మరియు ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కి ఇటలీ లో ఘనంగా వివాహం జరిగింది.