Niharika Konidela : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని.. కొన్నాళ్లు బాగానే ఉన్నా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. డివోర్స్ అనంతరం ఏ మాత్రం కుంగిపోకుండా నిహారిక జీవితంలో తన కాళ్ల మీద తను నిలబడాలని నిర్మాతగా మారింది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, హోస్ట్‌గా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో మరింత దూకుడు చూపించేందుకు ఉత్సాహం చూపిస్తోంది. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తోంది. తద్వారా ఫ్యాన్స్‌కు మరింత చేరువలో ఉంటోంది.

తాజాగా ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనం అవుతోంది. నిహారిక అండ్ పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందట. కొత్త డైరెక్టర్ వీళ్లిద్దరి కలయికలో అద్భుతమైన లవ్ స్టోరీని డిజైన్ చేశారట. అంతేకాకుండా వీరిద్దరి హై ఎనర్జీతో కూడిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఈ మూవీ ట్రూ లవ్ బేస్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు సమాచారం. నిహారిక-వైష్ణవ్ నటించబోయే సినిమా రాధే శ్యామ్ సినిమా రేంజ్‌లో హిట్ కొట్టనుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

ఈ వార్త విన్న నెటిజన్లు నిహారికపై దారుణంగా ఫైర్ అవుతున్నారు. భర్త చైతన్యతో విడాకులు తీసుకుని నెట్టింట్లో ఇప్పటికి ట్రోల్స్ ఎదుర్కున్నది చాలు. ఇంకా బావతో రొమాన్స్ చేసి.. మెగా ఫ్యామిలీ పరువు తీస్తావా? ఇలాంటి చిత్రాల్లో నటించడం నీకు అవసరమా? అందరూ అనుకున్నంత పని చేస్తున్నావ్ గా అంటూ నెటిజన్లు మెగా డాటర్ పై దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఇటు నిహారిక కానీ అటు వైష్ణవ్ తేజ్ కానీ స్పందించలేదు.