Niharika Konidela : లవ్ లెటర్ టు మై ఏంజిల్స్.. వైరల్ గా మారిన నిహారిక ప్రేమలేఖ

- Advertisement -

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఏం చేసినా వైరల్ గా మారుతోంది. ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిలో సందడి చేసింది. అన్నపెళ్లిలో డ్యాన్స్ వేస్తూ అటెన్షన్ అంతా తనవైపు తిప్పుకుంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా నిహారిక తన ఇన్‌స్టాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. తనకు అత్యంత ఇష్టమైనవారికి.. అంతే కాకుండా తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారందరికీ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ ఓక్క వీడియోలోనే తనకు నచ్చిన వారందరూ వచ్చేలా వీడియో చేసి దాన్ని పోస్ట్ చేసింది. వీడియోతో పాటు ‘లవ్ లెటర్‌ టూ ఆల్ మై ఏంజెల్స్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

niharika konidela
niharika konidela

నిహారిక పోస్ట్ చేసిన వీడియోలో లావణ్య త్రిపాఠి, శ్రీజ కొణిదెల, జ్యోతిరాజ్ సందీప్, నిహారిక తల్లి కూడా ఉన్నారు. తన జీవితంలోకి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అని అర్థం వచ్చేలా ఆ వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చింది ఈ మెగా బ్యూటీ. వారితో గడిపిన క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అంటూ ప్రస్తావించింది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ క్రేజీ కామంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయంలోకి వస్తే మరో పెద్ద బాధ్యతను తీసుకుంది మెగా డాటర్. దాదాపు 15 మంది కొత్త నటీనటులతో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభోత్సవానికి నూతన దంపతులు వరుణ్ – లావణ్య కూడా హాజరయ్యారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here