Niharika Konidela మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీఒక్కరు దాదాపుగా సక్సెస్ అయ్యారు ఒక్క నిహారిక కొణిదెల తప్ప. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమెని ఆడియన్స్, మెగా ఫ్యాన్స్ అంతగా ఆదరించలేదు. దీంతో ఈమె నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు చేసింది. అవి కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ కమిటీ కుర్రాళ్ళు అనే చిత్రాన్ని నిర్మించింది. కొత్తవాళ్లతో కొత్తతరహా కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రం ఈ నెల 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను పంచుకుంది.
ఆమధ్యన అక్కినేని అఖిల్ తో మీరు సినిమాలు చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి కదా, ఆ సినిమా ఏమైంది అని నిహారికాని అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘ అది సినిమా కాదు , షార్ట్ ఫిలిం. అప్పట్లో మేమిద్దరం సరదాగా కలిసి ఒక షార్ట్ ఫిలిం చేసాము. దానికి రాజమౌళి గారి కొడుకు కార్తికేయ దర్శకత్వం వహించాడు. ఆ షార్ట్ ఫిలిం ఫైనల్ ఔట్పుట్ ని కార్తికేయ రాజమౌళి గారికి చూపించగా, చాలా దరిద్రంగా ఉంది, రిలీజ్ చెయ్యకండి అన్నాడు. అలా మా సీక్రెట్ షార్ట్ ఫిలిం బయటకి రాకుండా అలాగే సీక్రెట్ గా మిగిలిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. షార్ట్ ఫిలిం చెత్తగా ఉన్నా పర్వాలేదు, యూట్యూబ్ లో విడుదల చెయ్యండి మేము చూస్తాము అంటూ నిహారిక ని ట్యాగ్ చేసి మెగా, అక్కినేని అభిమానులు అడుగుతున్నారు.
ఇకపోతే నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అడవి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ ‘ఈ ఏడాది మా కుటుంబానికి ఎంతో అద్భుతంగా కలిసి వచ్చింది. మా పెద్దనాన్న చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, అన్నయ్య రామ్ చరణ్ సినిమా ఆస్కార్స్ వరకు వెళ్ళింది. చిన్ననాన్న పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇదే ఊపులో నా మొట్టమొదటి ఫీచర్ ఫిలిం కమిటీ కుర్రాళ్ళు ని కూడా హిట్ చెయ్యండి ప్లీజ్’ అంటూ నిహారిక మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.