నిహారిక ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. మెగా డాటర్(Mega Daughter)గా ఆమెకు మంచి ఫేమ్ ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’లో(Dead Pixels) తాజాగా నటించింది. ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల అయింది. అయితే, సిరీస్ లో నిహారిక చెప్పే ఓ డైలాగ్ కారణంగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా అంతా ఆవిడ విడాకుల గురించే మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ వివాదంతో నిహారిక మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ ట్రైలర్ లో నిహారిక (Niharika) చెప్పిన డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. నిహారిక చెప్పిన డైలాగ్ ఏంటంటే నాకు బెడ్ పై రోషన్ కావాలి..మైండ్ లో భార్గవ్ ఉన్నాడు.. ఈ ఒక్క డైలాగ్ తో మెగా డాటర్ నిహారికని నెట్టింట్లో చాలామంది ట్రోల్ చేస్తున్నారు. నిహారిక డెడ్ పిక్సెల్స్(Niharika Dead Pixels) సిరీస్‌ను బాగా ప్రమోట్ చేస్తోంది. ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఈ డైలాగ్‌ల గురించి ఆమె ఏమి చెబుతుందో అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిహారిక కొణిదెల, సాయిరోనక్, హర్షచెముడు ప్రధాన పాత్రల్లో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తోన్న ఈ సిరీస్ మే 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

బ్రిటన్ సిరీస్ డెడ్ పిక్సెల్స్ ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తోన్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గా డెడ్ పిక్సెల్స్ సిరీస్ రూపొందుతోన్నట్లు తెలిసింది. ఈ సిరీస్‌లో గాయత్రి అనే నేటితరం యువతిగా నిహారిక కొణిదెల నటిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే గత కొన్ని రోజుల నుండి మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda Chaithanya) తో విడాకులు తీసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వార్తలకు తగ్గట్టుగానే వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడం అలాగే పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం వంటివి అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.