మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తుంది. గత కొన్ని రోజులగా మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెపై వార్తలు మరీ ఎక్కువయ్యాయి. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న నిహారిక నటనకు దూరంగా ఉంటూ వచ్చింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటూ వచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ రీసెంట్‌గా భర్తతో ఉన్న ఫొటోలను ఆమె డిలీట్ చేసింది. దీంతో భర్త నుంచి ఆమె విడిపోయిందంటూ కూడా వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీనికి ఆమె మౌనమే సమాధానమైంది.

ఈ నేపథ్యంలో నిహారిక తన ఫాలోవర్స్, నెటిజన్స్‌కు చిన్న షాకిచ్చింది. అదేంటంటే.. మళ్లీ ఆమె యాక్టింగ్‌లోకి అడుగు పెట్టింది. చాలా రోజులుగా వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ అంటూ నిర్మాణానికే పరిమితమైన ఆమె ఉన్నట్లుండి యూ టర్న్ తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. నిహారిక డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్‌తో యాక్టింగ్‌లోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన ఆమె తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. నిహారికతో పాటు సాయి రోనక్, అక్షయ్ లంగుసాని, వైవా హర్ష ప్రధాన పాత్రధారులుగా ఈ సిరీస్ రూపొందింది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా నిహారిక చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. వైట్ షర్ట్ కింద ప్యాంట్ లేకుండా బీచ్ లో నిహారిక చేసిన అందాల షోకి మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా తన అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది ఈ మెగా డాటర్ . అంతేకాదు నాతో ఎవ్వరికి సంబంధం లేదు ఎవరితో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఒంటరిగా నడుచుకుంటూ.. బీచ్ లో తెగ ఎంజాయ్ చేస్తూ రచ్చ చేసింది నిహారిక. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .