Nidhi Agarwal : సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని వారి అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది.. చిన్ననాటి ఫోటోలను ప్రస్తుత వారి ఫోటోలతో పోలుస్తూ.. వారు ఎంత ఎత్తుకు ఎదిగారో పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. తాజాగా కుర్రాళ్ల కలల రాకుమారి.. నేటి స్టార్ హీరోయిన్ అయిన అమ్మడి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో మీరు గుర్తుపట్టారా..

చీర కట్టులో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి ని చూడగానే భలే ముద్దొచ్చింది కదా.. సంప్రదాయమైన డ్రెస్ లో నడుముకి వడ్రానం పెట్టుకొని తలలో నిండుగా మల్లెపూలు పెట్టుకొని క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి పుట్టింది హైదరాబాదులోనే.. పెరిగింది మాత్రం బెంగుళూరులో.. అయితే నేను పెద్దయిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చి హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది.. గ్లామర్ కి హద్దులు జరిపేసి హాట్ అందాలతో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటీ..

పైనున్న ఫోటోలో పద్ధతిగా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఈ అమ్మడు తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పుట్టింది హైదరాబాద్లో అయినా పెరిగింది బెంగళూరులోనే.. మోడలింగ్ అంటే చిన్నప్పటినుంచి ఇష్టం ఉండటంతో.. 2014లో మిస్ దివా యూనివర్సిటీలో పాల్గొంది. హిందీలో మున్నా, మైఖేల్ సినిమాలో నటించింది. ఆ తరువాత నాగచైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు వరకు పరిచయమైంది ఈ తెలుగందం..
ఆ తరువాత అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అయిన గాని ఈ అమ్మడికి అంతగా ఫేమ్ రాలేదు. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరముల్లు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పైనే అమ్మడి ఆశలన్నీ పెట్టుకుంది. నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటో షూట్లతో కుర్ర కారు గుండెల్లో కాక రేపుతూ ఉంటుంది.