Niharika : విడాకుల తర్వాత ఫ్రెండ్స్ తో అలా చేస్తున్న నిహారిక.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..

- Advertisement -

మెగా డాటర్ నిహారిక గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.. ఇక తాజాగా ఈ మధ్య భర్త నుంచి విడాకులు తీసుకుంది.. విడాకులు అయ్యి కొద్ది రోజులు కూడా అవ్వక ముందే అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎనర్జిటిక్ పోస్ట్స్ పెడుతున్నారు. ఇది ఒకింత విమర్శల పాలవుతుంది. భర్తతో విడిపోయిన బాధ ఆమెకు కొంచెం కూడా లేదని కామెంట్స్ పెడుతున్నారు.. కొందరైతే మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. తాజాగా ఫ్రెండ్స్ తో ఉన్న కొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో నిహారిక షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Niharika
Niharika

నిహారిక కొణిదెల అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. కొన్నాళ్లుగా భర్త వెంకట చైతన్యకు ఆమె దూరంగా ఉంటున్నారు. విడాకులు తీసుకున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా ఇటీవల స్పష్టత వచ్చింది. నిహారిక, వెంకట చైతన్య కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. వెంకట చైతన్య, నిహారిక విడాకుల పిటిషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..ఇద్దరూ విడాకులకు సమ్మతం తెలిపిన నేపథ్యంలో సులభంగా డివోర్స్ మంజూరు కానున్నాయి. అధికారికంగా నిహారిక, వెంకట చైతన్య భార్యాభర్తలు కాదు.. మేము అందరి అంగీకారాంతోనే విడాకులు తీసుకున్నాం అని ఇటీవల నిహారిక పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది..

Niharika

అస్సలు కొద్దిగా కూడా ఫీల్ అవ్వకుండా లైట్ తీసుకుంది.. అంతేకాదు ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది.. ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయారు.. నిజానికి నిహారిక హీరోయిన్ కావడం మెగా ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. ఆమె హీరోయిన్ కావడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. నిహారిక పట్టుదలతో హీరోయిన్ అయ్యారు. ఆ మధ్య నైట్ పబ్ పై జరిగిన దాడిలో పట్టుబడటం, భర్తతో విడాకులు తీసుకోవడం వంటి విషయాలు మెగా ఫ్యామిలీని ఇరకాటంలో పెడుతున్నాయని పలువురు భావిస్తున్నారు.. ఇక రెండో పెళ్లి చేసుకుంటుందా లేక సింగిల్ గానే ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here