టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో Surekha Vani కూడా ఒకరు.. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆమె అలరించారు. టాలీవుడ్ లో మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా సురేఖ వాణి యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల సురేఖ వాణి భర్త మరణించిన సంగతి అందరికీ తెలిసింద. కాగా తాజాగా తను సోషల్ మీడియాలో ముత్తైదువుల కనిపించిన ఫోటోలు అందరినీ షాక్ కి గురి చేసింది.. దాంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు..
సురేఖ వాణి వరుస సినిమాలతో కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో భర్త సురేష్ తేజ ఆకస్మిక మరణంతో సురేఖ వాణికి జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ దుర్ఘటన తర్వాత ఆమె చాలా రోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇక ఆ నేపథ్యంలోనే సినిమాలకు కూడా దూరంగా ఉంది. అప్పుడు కూతురు సుప్రీత ఆమెను ఆ ఆలోచనల లోనుంచి బయటకు వచ్చేలా చేసినట్లు సురేఖ వాణి స్వయంగా తెలిపింది.
అప్పట్లో సురేఖ వాణి రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది. దానిపై సుప్రీత స్పందించి.. అలాంటివి ఏమీ లేదని తెలిపింది. దాంతో సురేఖ వాణి సుప్రీత ఇద్దరు లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇక తల్లి కూతుర్లు ఇద్దరు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతూ చేసే రచ్చ అంతా కాదు. వాళ్ళ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్ర కారుకి పిచ్చెక్కిస్తూ వారి మది దోచుకుంటున్నారు.. కాగా సురేఖ వాణి నుదిటి పైన బొట్టు, మెడలో నల్లపూసలు ధరించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. దాంతో ఈమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాస్తవానికి భర్త చనిపోయిన స్త్రీలు ఎవరు కూడా నుదుటిమీద కుంకుమ పెట్టుకోవడానికి కానీ.. మెడలో నల్లపూసలు వేసుకోవడానికి కానీ ఇష్టపడరు. తాజాగా షూటింగ్లో పాల్గొన్న సురేఖ వాణి చీర కట్టుకొని మెడలో పసుపుతాడు, నల్ల పూసలు, పాపిట్లో బొట్టు పెట్టుకుని కనిపించింది. ఇక దానికి సంబంధించిన ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ఆమెను నేటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు . భర్త చనిపోయాక ఏ స్త్రీ కూడా సుమంగళిగా కనిపించాలని అనుకోదు అలాంటి అన్ని విషయాలు తెలిసిన మీరు సినిమాలో అలాంటి పాత్ర చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు అని కొంతమంది ఆమెను విమర్శిస్తున్నారు. మరికొంతమంది సురేఖా వాణి ఈజ్ బ్యాక్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయినా వృత్తిలో ఇలాంటివి కామన్ అని కొంతమంది భాగమని కొట్టి పారేస్తున్నారు..