డబ్బు కోసం ఇంత పని చేస్తావా.. రాజమౌళిని తిట్టిపోస్తున్న నెటిజన్లు

- Advertisement -

మంచికి పోతే చెడు ఎదురైందనే సామెత విన్నారు కదా. సరిగ్గా ఇదే జరిగింది మన దర్శకదీరుడు రాజమౌళికి. ఓ చిన్న సినిమాను ప్రమోట్ చేద్దామని చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనకే రివర్స్ అయ్యింది. రాజమౌళిపై ట్రోలింగ్స్ తో రెచ్చిపోతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఎం జరిగింది అంటే. చాయ్ బిస్కెట్ సంస్థ నుంచి వ‌చ్చిన తాజా చిత్రం మేం ఫేమ‌స్‌. అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ చిన్న సినిమాకు ప్రమోషన్స్ మాత్రం భారీగానే చేసారు మేకర్స్. అందులో ముఖ్యంగా మ‌హేష్ బాబు ఈ సినిమా గురించి పాజిటీవ్ గా ట్వీట్ చేసాడు. ఆ తర్వాత స్టార్ డైరక్టర్ రాజ‌మౌళి కూడా సేమ్ సీన్ రిపీట్ చేశాడు.

రాజమౌళి
రాజమౌళి

చాలా కాలం త‌ర‌వాత‌.. ఓ సినిమా చూసి, బాగుందంటూ ట్వీట్ చేశాడు రాజ‌మౌళి. దీంతో ఈ సినిమాకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. అయితే రిలీజైన రోజున ఈ సినిమాకు నెగిటీవ్ బ‌జ్ వచ్చింది. రివ్యూలూ కూడా అలానే వ‌చ్చాయి. ఇలాంటి సినిమాకు మహేష్, రాజమౌళి వంటి స్టార్ సెల‌బ్రెటీలు సపోర్ట్ చేయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమా బాగుంది కానీ రాజమౌళి ప్రత్యేకించి మరీ ట్వీట్ వేసేంతగా సినిమా లేదని నెటిజన్స్ అంటున్నారు. మీరు కూడా విశ్వసనీయత లేని ట్వీట్స్ వేస్తారేంటి సార్ అని కామెంట్స్ చేస్తున్నారు. మీ స్థాయి వేరు సార్, తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిన మీరు ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేయవలసిన అవసరం లేదు సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Rajamouli Mahesh

నిజమే రాజమౌళి స్థాయి వేరు. తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన దర్శక దిగ్గజం. అలాంటి ఆయన చిన్న సినిమాలను పట్టించుకునేంత అవసరం, తీరిక ఉండవు. కానీ అంత గొప్ప దర్శకుడు అయినా కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చిన్న సినిమాలను చూసి బాగుందని చెప్పి ప్రమోట్ చేస్తుంటారు. ఆయన కూడా ఒకప్పుడు సీరియల్ ద్వారా వచ్చిన వారే కదా. అందుకే ప్రతిభావంతులను గుర్తించి వారిలో ఉత్సాహాన్ని నింపుతుంటారు. అలానే ఇప్పుడు కూడా మేమ్ ఫేమస్ సినిమా నటులను, సినిమాని ప్రమోట్ చేస్తున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here