Rashmika Mandanna : నాని హీరోగా… మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా… శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ ఎమోషనల్ మూవీ “హాయ్ నాన్న” నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఫర్వాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమాలో నాని నటనకు అభిమానులు పూర్తిగా ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో నాని చాలా కూల్ అండ్ డీసెంట్ లుక్లో కనిపిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషన్ ప్రేక్షకులను ఏడిపించింది. ఈ సినిమాలో శృతి హాసన్ చిన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రుతి పాత్ర చిన్నదే అయినా అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ పాత్ర కోసం దర్శకుడు ముందుగా మరో హీరోయిన్ని సంప్రదించాడట. కానీ ఆ స్టార్ హీరోయిన్ ఈ పాత్రను తిరస్కరించిందట. ఆమె మరెవరో కాదు రష్మిక మందన్నా.
ఆమె ఈ సినిమాను తిరస్కరించడమే కాకుండా ఈ సినిమాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేసిందట. ఇంత చిన్న పాత్రలో నటిస్తే క్రేజ్ తగ్గుతుందని భావించిన ఆమె.. ఈ పాత్రను తిరస్కరించిందట. పైగా రష్మిక తన స్నేహితులతో అది బిస్కెట్ క్యారెక్టర్ అని చీప్ గా మాట్లాడిందట.. అది సినిమాకి అసలు హైలైట్ కాబోదని అభిప్రాయపడిందట. ఇక ఆమె వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కు పోయాక నీకు కళ్లు నెత్తికెక్కాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.