Neha Shetty : చిలిపి పోజులతో దిల్ ఖుష్ చేసిన రాధిక

- Advertisement -

Neha Shetty ఈ పేరు తెలియని వారుంటారేమో కానీ రాధిక పేరు తెలియని వారు మాత్రం ఉండరు . ఒక్క సినిమాతో యావత్ తెలుగు రాష్ట్రాల కుర్రకారు గుండెల్లో పర్మినెంట్ ఆధార్ కార్డులా తిష్ట వేసేసింది. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం అనే ఒక్క డైలాగ్ తో సూపర్ పాపులర్ అయిపోయింది. ఆ సినిమాతో ఈ భామకు టాలీవుడ్ లో బెస్ట్ హిట్ వచ్చేసింది.

Neha Shetty | చిలిపి పోజులతో కవ్విస్తున్న నేహా శెట్టి-Namasthe Telangana

ఇక డీజే టిల్లు మూవీ తర్వాత నేహా శెట్టి టాలీవుడ్ లో పాపులర్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ భామ సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా డబుల్ అయిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా రాధిక ధ్యాసే.. ఏ అమ్మాయి ఆ క్యారెక్టర్ లా బిహేవ్ చేసినా రాధికతో పోల్చడం షురూ అయింది. అలా సూపర్ పాపులర్ అయిన నేహా తన ఫ్యాన్ బేస్ ను పెంచుకునేందుకు సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ అయింది.

- Advertisement -

Neha Shetty | చిలిపి పోజులతో కవ్విస్తున్న నేహా శెట్టి-Namasthe Telangana

అలా తరచూ ఫొటోలు పెడుతూ కుర్రాళ్లను ఖుష్ చేస్తోంది. తాజాగా నేహా శెట్టి కూల్ పిక్స్ ను పోస్టు చేసింది. బెడ్ పైన కూర్చొని క్యాజువల్ వేర్ లో ఫొటో క్లిక్ చేస్తున్నట్లు పోజిచ్చి దిగిన ఫొటోలో భలే క్యూట్ గా కనిపించింది. ఇంకొక పిక్ లో షర్టును భుజంపై నుంచి కాస్త పక్కకు జరిపి హాట్ లుక్ ఇచ్చి అదరగొట్టింది. మొత్తాని నేహా శెట్టి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక నేహా శెట్టి సినిమాల సంగతికి వస్తే టిల్లు స్క్వేర్ లో గెస్ట్ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here