Ariyana : అందరిముందే సదాతో గొడవ పెట్టుకున్న అరియానా.. ఎక్కువైందంటూ తిడుతున్న నెటిజన్స్

- Advertisement -

Ariyana : బిగ్‌బాస్ అభిమానుల కోసం మాటీవీ ‘నీతోనే డ్యాన్స్ 2.0’ అనే డ్యాన్స్ షో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ హౌస్‌లో ఉన్న గొడవలు, రొమాన్స్, కుళ్లు, కుతంత్రాలకి ఏ మాత్రం తీసిపోకుండా ఈ షో డిజైన్ చేశారు. డ్యాన్స్ మాట పక్కన పెడితే ఈ షోలో గొడవలు బిగ్‌బాస్‌ను మించిపోయేలా ఉంటాయి. షోలో మసాలా తగ్గిందనుకున్నారో ఏంటో కానీ తాజాగా మరో రెండు జంటలను వైల్డ్ కార్డు ఎంట్రీతో రంగంలోకి దించారు. మనం ముందే చెప్పినట్లుగా అరియానా-అవినాష్, అమర్‌దీప్-తేజస్విని గౌడ జంటలు షోలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక వచ్చీ రాగానే మిగిలిన జోడీలతో ఓ రేంజ్ లో తగులుకున్నాయి కొత్త జంటలు. కానీ ప్రోమో మొత్తానికి హైలెట్ అయింది అరియానా.

‘నీతోనే డాన్స్ 2.0’ షోకి సదా, రాధిక జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతీవారం లాగే ఈ వారం కూడా ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో భాగంగా మానస్- సుబ్బు జోడీలో సుబ్బుకి హెల్త్ బాలేని కారణంగా మానస్ ఒక్కడే షోకి వచ్చాడు. ఐతే మరి జోడీ ఎవరు నీకు అని శ్రీముఖి అంటుండగానే వెనక నుంచి భానుశ్రీ ఎంట్రీ ఇచ్చింది. “అబ్బాయి అబ్బాయి డ్యాన్స్ చేయకూడదు.. అబ్బాయి అమ్మాయి డ్యాన్స్ చేయాలి” అని శ్రీముఖి అనేసరికి అందరూ నవ్వేశారు. అలాగే అమరదీప్ – తేజస్విని గౌడ ఇద్దరూ ఈ షో లో కనిపించారు.

- Advertisement -

సాధారణంగా ఏ షోలోనైనా కంటెస్టెంట్లు గొడవపడుతూ ఉంటారు. కానీ వెరైటీగా ఈసారి నీతోనే డ్యాన్స్‌లో జడ్జీలతోనే గొడవ పెట్టుకునేలా మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. లేటెస్ట్ ప్రోమోలో నయని-విశ్వ జోడీ చేసిన డ్యాన్స్ అమోఘం, అద్భుతం అంటూ జడ్డీలు సదా, రాధ, తరుణ్ మాస్టర్ ఆకాశానికి ఎత్తేశారు. అయితే వీరి డ్యాన్స్‌కి అరియానా-అవినాష్ జోడి ఆరు మార్కులు ఇచ్చింది. ఒక్క స్టెప్ మిస్ అయితే ఆరు మార్కులు ఎందుకు ఇవ్వకూడదంటూ.. పెద్ద పాయింటే లాగింది అరియానా. అంటే అరియానా డ్యాన్స్‌కి వీళ్లూ ఆరు మార్కులే ఇచ్చారనుకోండి అది వేరే విషయం. అయితే ఈ మార్కులు చూడగానే జడ్జి సదాకి చిర్రెత్తుకొచ్చింది.

అదేంటి నాలుగు మార్కులు తగ్గించాలా అంటూ సదా అడిగింది. దీనికి అరియానా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మరి మాకు ఆరే మార్కులు వచ్చినప్పుడు నాకూ అంతే బాధేసింది అంటూ అరియానా రియాక్ట్ అయింది. దీంతో ఇంకాస్త డోసు పెంచుతూ వాళ్లు స్టెప్ మిస్ అవ్వలేదు.. అయినా మిస్ అనేది ఎవరైనా చేసేదే అంటూ సదా అరిచింది. దీనికి ఏం చేయలేక కాస్త అరియానా చిరాకుగా ఫేస్ పక్కకి తిప్పుకుంది. దీంతో వెంటనే సదా ఫైర్ అయింది. నా ముందు అలా ఫేస్ పెట్టకు అరియానా.. బాగోదు అంటూ సదా వార్నింగ్ ఇచ్చింది. దీనికి అరియానా ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసింది. సదాకి ఈ డాన్స్ షో లో బ్రిట్టో, విశ్వా, నేహా చౌదరి, యావర్ అంటే విపరీతమైన ఇష్టం..వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వదు. అని అరియనా గట్టిగా అన్న మాటలకు సదా అహం దెబ్బతిని షో నుంచి లేచి వెళ్ళిపోయింది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here