టాలీవుడ్లో హీరోయిన్లకు కొరత లేదు. ఇప్పటికే తమిళ, కన్నడ, మలయాళ భాషల కథానాయికలను తెలుగు చిత్రసీమలోకి దింపుతున్నారు. ఈ మధ్య డైరెక్టర్ల చూపంతా బాలీవుడ్‌పై పడింది. పాన్ ఇండియా మోజులో పడి సినిమాకు బాలీవుడ్‌లోనూ కాస్త హైప్ రావాలని అక్కడి హీరోయిన్లను దించేస్తున్నారు. ఆలియా భట్, శ్రద్ధా కపూర్, అనన్యా పాండే ఇప్పటికే తెలుగు కుర్రాళ్లను తమ అందాలతో ఫిదా చేశారు. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా త్వరలోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మరో బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరంటే..?
నందమూరి బాలకృష్ణ అప్‌కమింగ్ మూవీ వీర సింహారెడ్డి విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా రాబోతోంది. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా షురూ అయ్యాయి. కాస్టింగ్ విషయంలో దాదాపు అందరూ సెట్ అయ్యారు. కానీ బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో హీరోయిన్ కోసం ఇప్పటికే రకరకాల పేర్లు వినిపించాయి. ఇక ఈ మూవీలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్యతో రొమాన్స్ చేసే వాళ్లెవరనేది మాత్రం క్లారిటీ రాలేదు. అప్పట్లో త్రిష పేరు వినిపించింది. ఆ తర్వాత నయనతార అని కూడా అన్నారు. అయితే నయన్ ఓ హీరోయిన్ తల్లిగా నటించడానికి నో చెప్పేసిందట. ఒకవేళ ఆ పాత్రకు తను ఓకే అనాలంటే భారీ మొత్తంలో పారితోషికం అడిగిందట. మనకెందులే బాబు అనుకుని నయన్‌ను కూడా పక్కన బెట్టేశారట.
అయితే బాలయ్యతో రొమాన్స్ చేయడానికి ఇక్కడ హీరోయిన్లు ముందుకు రావడం లేదని బాలీవుడ్ నుంచి ఓ బ్యూటీని దింపడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. దబంగ్ బ్యూటీ అదేనండి సోనాక్షి సిన్హాను కూడా ఓకే చేసినట్లు టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై సోనాక్షి క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. ‘నేను ఒక తెలుగు సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఆ విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను పలనా చిత్రంలో సెలెక్ట్ అయ్యాను అని ఆ తర్వాత మళ్లీ తప్పుకున్నాను అని ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు ఆర్టికల్స్ రాస్తున్నారు. ఆ విషయంలో ఎలాంటి నిజం లేదు. అసలు నన్నెవరూ సంప్రదించలేదు.’ అని ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చేసింది.