Nayanthara : సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరోల పక్కన డ్యాన్స్ వేస్తేనే హీరోయిన్ అని అనుకుంటున్న ఈరోజుల్లో నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ నేడు ఈ స్థాయికి వచ్చింది. వ్యక్తిగతంగా ఆమె మీద ఎన్ని కాంట్రవర్సిలు ఉన్నా, నటిగా మాత్రం నయనతార రేంజ్ వేరు అనే చెప్పాలి.

శింబు , ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం నడిపిన నయనతార, ఇటీవలే సతీష్ విగ్నేష్ అనే ప్రముఖ తమిళ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న అతి తక్కువ సమయం లోనే ఇద్దరు కవల పిల్లలకు జన్మని ఇచ్చారు. పెళ్ళై ఆరు నెలలు కూడా నిండకుండా కవల పిల్లలు ఎలా పుట్టారు అని ఆరా తియ్యగా, సరోగసి పద్దతి ద్వారా పిల్లల్ని పొందారు అని తర్వాత తేలింది. దీని మీద పెద్ద రచ్చ జరిగింది.

కోర్టు లో కేసు కూడా నిన్న మొన్నటి వరకు నడిచింది, తీర్పు నయనతార – విగ్నేష్ లకు సపోర్టు గానే వచ్చింది. అదంతా పక్కన పెడితే ఇప్పుడు నయనతార మరోసారి కవల పిల్లలకు జన్మని ఇచ్చింది అంటూ కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చింది. అదేంటి నిన్నగాక మొన్న కూడా నయనతార కడుపుతో ఉన్నట్టు రీసెంట్ ఫోటోలలో కనిపించలేదు, మళ్ళీ కవల పిల్లలకు జన్మనిచ్చిందా?, అంటే మరోసారి సరోగసి పద్దతి ద్వారా పిల్లల్ని పొందిందా? వంటి కామెంట్స్ నెటిజెన్స్ నుండి వచ్చాయి.

అయితే అసలు విషయం ఏమిటంటే వీళ్లిద్దరికీ మళ్ళీ కవల పిల్లలు జన్మించలేదు. ఇన్ని రోజులు నయనతార – విగ్నేష్ సోషల్ మీడియా లో తన పిల్లల పుట్టినప్పుడు ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. కానీ ఇప్పుడు అప్పట్లో పుట్టిన కవల పిల్లలకు సంబంధించిన పాత ఫోటోలను అప్లోడ్ చేసారని, దానిని కొంతమంది మళ్ళీ ఇద్దరు కవల పిల్లలకు జన్మని ఇచ్చినట్టు అనుకున్నారు అంటూ నయనతార సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చారు.
