Nayanthara సౌత్ ఇండియాలో మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ పాపులర్ హీరోయిన్. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ బిగినింగ్ లో పెద్దగా హిట్ లేకపోయినా.. ఆ తర్వాత తన బాడీని మార్చుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అమ్మడు ఎన్నో లవ్ ఎఫైర్స్ నడిపి చిత్రపరిశ్రమలో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. అలాంటి ప్రేమాయణాల తర్వాత చివరకు కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే పెళ్లి తర్వాత నయనతార, విఘ్నేష్ ఎందుకు కలిసిరాలేదు. ఏది పట్టుకున్నా అదే ఫలితం నెగిటివ్ గానే వచ్చింది. ఎల్ ఐ సి సినిమా విషయంలో ఎంత పెద్ద రాద్దాంతం అయిందో చూసాం . అంతే కాదు కొందరు హీరోస్ ఆమెను మోసం చేశారు అని అలాంటి వాళ్లతో ఇక జన్మలో నటించను అంటూ తెగేసి చెప్పింది నయనతార అని ప్రచారం జరిగింది .
ఆ మధ్య నయనతార తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అదంతా ఫేక్ అని, అలాంటిదేమీ లేదని నయనతార పరోక్షంగా స్పష్టం చేసింది. తాజాగా ఆమె ఓ తెలుగు చిత్రానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఓ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా నయనతార ఎంపికైంది. గతంలో నయనతార వెంకటేష్ సినిమాలకు మంచి ఆదరణ ఉండేది. వీరి కాంబోపై అభిమానులు కూడా ఓ రేంజ్‌లో అంచనాలు వేస్తున్నారు. నయనతారకు విఘ్నేష్ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. దీంతో ఈ జంట తెలుగు అభిమానులకు శుభవార్త అందించింది. వార్త విన్న తెలుగు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
