Nayanthara : సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.. ఆమె సాధించిన విజయాలు, చేసిన పాత్రలు అన్నీ ప్రత్యేకమే.. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన స్టార్ హీరోయిన్ ఈమె.. టాలీవుడ్ మరియు కోలీవుడ్ కలిపి దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన నటించింది.. ఇప్పుడు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ – అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘జవాన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
హీరోయిన్ గా నయనతార కి వంకలు పెట్టలేం.. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఈమె ఎన్నో కాంట్రవర్సీలలో చిక్కుకుంది.. ప్రముఖ హీరో శింబు తో అప్పట్లో ఈమె నడిపిన ప్రేమాయణం ఒక సెన్సేషన్.. ఆ తర్వాత ప్రభుదేవా మాస్టర్ తో ప్రేమాయణం పెళ్లిపీటలు దాకా వెళ్లి ఆగిపోయింది.. చివరికి ప్రముఖ తమిళ దర్శకుడు సతీష్ విగ్నేష్ ని పెళ్ళాడి జీవితం లో స్థిరపడింది.
ఇదంతా పక్కన పెడితే ఏ ఇండస్ట్రీ కి వెళ్లినా కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు పెద్ద సమస్య గా మారిన సంగతి తెలిసిందే..హీరోయిన్స్ కి అవకాశాలు రావాలంటే నిర్మాత కి కామ వాంఛలు తీర్చాల్సిందే..దీని పై నయనతార లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడింది.
ఆమె మాట్లాడుతూ ‘కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అంటే నేను సమాధానం సరిగ్గా చెప్పలేను.. ఎందుకంటే అది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుంది.. నేను కూడా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో కొంతమంది నిర్మాతలు నన్ను కమిట్మెంట్ అడిగారు.. నిర్మొహమాటంగా నేను కుదరదు అని చెప్పాను.. ఒక నిర్మాతని చెప్పుతో కొట్టిన సందర్భం కూడా ఉంది.. కేవలం నా ప్రతిభ ని నమ్ముకొనే నేను ఇంత దూరం సినీ ప్రయాణం ని కొనసాగించాను’ అంటూ చెప్పుకొచ్చింది నయనతార.. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చింది.