Nayanthara తమిళ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లామర్ క్విన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.ఒక్కో సినిమా తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఈమె ఒక్కటే..ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు ఎవరికీ సాధ్యం కానీ హీరోలకు దీటుగా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది..లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది నయనతార. ఓ వైపు మహిళా ప్రధాన చిత్రాలు, మరోవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.. అలాంటి నయన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిందనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.. అసలు నిజమేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి ఐదు నుంచి ఆరు కోట్ల వరకు అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి షారూఖ్ ఖాన్‌తో `జవాన్` చిత్రంలో నటిస్తుంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. తమిళంలో `ఇరైవన్` చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ మూవీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నాక సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటుందట నయనతార. కొన్నాళ్లపాటు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే టైమ్‌కి కేటాయించాలను కుంటుందట. ఆ మధ్య నయనతార, విఘ్నేష్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సరోగసి ద్వారా పేరెంట్స్ గా మారారు ఈ జంట..
అయితే ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి కష్టంగా ఉండటంతో సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటుందట.. మరి బ్రేక్ మాత్రమేనా, పూర్తిగా సినిమాలకు దూరమవుతుందా? అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వాస్తవానికి పెళ్లి చేసుకున్న సమయంలో నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందనే వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఆ వెంటనే తేలిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి ఈ వార్తలు తెరపైకి రావడం ఆశ్చర్యపరుస్తుంది.. అందులో నిజమేంతో తెలియాలంటే నయనతార క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే..ఈ వార్త తో చాలా మంది హీరోయిన్లు సంబరాలు చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి..