Nayanthara : పెళ్లి తర్వాత తన కోరిక తోర్చుకోబోతున్న నయనతార

- Advertisement -

Nayanthara : స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోల సరసన నటించారు. దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. అయినా ఆమెకు తీరని కోరికలున్నాయట. ఇన్నాళ్ల కెరీర్, పెళ్లి తర్వాత తన కోరిక తీర్చుకోబోతుందట.. నయనతార సౌత్ ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా తమిళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. దానికి కారణం ఆమెకి ఉన్న క్రేజ్.. వచ్చిన సినిమాలు అన్నీ ఓకే చేస్తే తనకున్న క్రేజ్ పాడైపోతుందని భావించిన నయనతార తనకు తగ్గ కథలను చూస్ చేసుకుంటుంది.

ఇటీవల నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు ఓ వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. సంజయ్ లీలా భన్సాలి సినిమాలో ఆఫర్ అంటే మామూలు మాటలు కాదు. దానికి ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటి ఒక రేర్ కాంబో ని ఇప్పుడు మనం తెరపై చూడబోతున్నాం. బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో హీరోయిన్ నయనతార జాక్ పాట్ ఛాన్స్ పట్టేసిందంటూ కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Nayanthara
Nayanthara

వాస్తవానికి విఘ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నయనతార క్రేజ్ పడిపోయిందని చెప్పాలి. అంతకుముందు నయనతార అంటే పెద్ద పెద్ద హీరోలు కూడా ఆసక్తి కనబరిచే వాళ్లు. కానీ ఈ మధ్యకాలంలో నయనతార అంటే ఇద్దరు ముగ్గురు హీరోలు మాత్రమే ఓకే అంటున్నారు. మిగతా హీరోలు అంతా వేరే హీరోయిన్ లకి ఓట్లు వేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో నయనతార కి సంబంధించిన వార్తలు ఎలాంటివి వైరల్ అయ్యాయో కూడా మనం చూశాం. ఒకానొక సందర్భంలో విఘ్నేశ్ నయన్ విడిపోతున్నారంటూ ప్రచారం కూడా జోరుగా సాగింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here