Nayanthara : సినిమా వేరు.. రియల్ లైఫ్ వేరు..సినిమాలలో లాగా మంచితనంతో కనిపించే హీరోయిన్లు నిజ జీవితంలో కూడా అదే విధంగా ఉంటారా.. అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. అందుకు ఊదాహరణగా స్టార్ హీరోయిన్ నయనతారను చెప్పొచ్చు.. ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఈమె ఒకరు.. కాగా ఈ హీరోయిన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఇప్పుడు నయన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

కొన్నిరోజుల క్రితం హీరో అజిత్- విఘ్నేష్ శివన్ కాంబోలో ఒక సినిమా ఫిక్స్ అయ్యింది.. ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడంతో విజయ్ సేతుపతి విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో ఒక సినిమాను ఫిక్స్ చేసే దిశగా నయనతార అడుగులు వేయడం గమనార్హం. అయితే విజయ్ సేతుపతి సుందర్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అవుతున్న సమయంలో ఆ సినిమాకు నో చెప్పి విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో నటించాలని నయన్ విజయ్ సేతుపతికి కోరిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. ఈ కామెంట్ల గురించి విజయ్ సేతుపతి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఈ విషయం తెలిసి నయనతార భర్త కోసం ఇంతకు తెగించిందా అంటూ నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నయనతారకు సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. నయనతార పారితోషికం ప్రస్తుతం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.

ఇక తెలుగు ప్రాజెక్ట్ లకు దూరంగా ఉన్న నయనతార తమిళంలో మాత్రం వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. నయనతార కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నారు. భర్త కెరీర్ కోసం నయనతార తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు నయన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. నయనతార మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే.. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నారన్న వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. నిజంగా సినిమాలకు గుడ్ బై చెప్పిందా లేదా గ్యాప్ తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది..