Nayanthara – Vignesh Shivan : ఇటీవల సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇంకొందరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందుతున్నారు. మరికొందరు పెళ్లయిన కొద్దిరోజులకే విడాకులు తీసుకుంటున్నారు. ఎంత త్వరగా ప్రేమలో పడుతున్నారో అంతకు డబుల్ స్పీడ్‌లో సపరేట్ అవుతున్నారు. ఇంకొందరయితే కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి పీటలెక్కి అలా దాదాపు 15 నుంచి 20 ఏళ్ల బంధంలో ఉన్న వారు కూడా సడెన్‌గా విడిపోతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి షాక్ ఇస్తున్నారు. అయితే వీరు డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టు పెట్టకుండా ముందుగానే ఒకర్నొకరు అన్ ఫాలో అవుతూ ఫ్యాన్స్‌కు హింట్ ఇస్తున్నారు. అయితే తాజాగా అదే జాబితాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు కూడా చేరినట్టు నెట్టింట ఒకటే రచ్చ జరుగుతోంది.

నయనతార, విఘ్నేశ్‌లు విడిపోనున్నారంటూ రెండ్రోజుల నుంచి సోషల్ మీడియా హోరెత్తుతోంది. దీనికి కారణం నయనతార తన భర్త విఘ్నేశ్ శివన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం. ఇది ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. దీంతో నెట్టింట రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వాటన్నింటికీ లేడీ సూపర్ స్టార్ చెక్ పెట్టారు. ఒక్క ఫొటోతో ఈ జంట తమ ప్రేమ బంధం పదిలంగానే ఉందని ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చాయి.
ప్రేమికుల రోజు తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్ చెప్పి పోస్ట్ పెట్టిన నయనతార తాజాగా అతడిని అన్‌ఫాలో చేయడంతో వాళ్లిద్దరు విడిపోతున్నారంటూ నెట్టింట ప్రచారం షురూ అయింది. వారి ఫ్యాన్స్ మాత్రం ‘సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా’ అని పోస్ట్‌లు పెట్టారు. వాటికి చెక్ పెడుతూ నయనతార తిరిగి విఘ్నేశ్‌ను ఫాలో అవుతున్నారు. అలాగే, విఘ్నేశ్ కూడా ఆమె ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసి ఈ గొడవకు చెక్ పెట్టారు.

ఇక నయనతార సినిమాల సంగతికి వస్తే గతేడాది ‘జవాన్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం భారీ రూ.1000కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నయన్ ‘టెస్ట్’ సినిమాలో నటిస్తోంది. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో నయనతార కనిపించనుంది.