‘జవాన్’ హిట్ తో అమాంతం రేటు పెంచేసిన నయనతార.. ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

- Advertisement -

లేడీ సూపర్ స్టార్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది నయనతార . ఈ మధ్యనే జవాన్ సినిమాతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిందని టాక్ నడుస్తోంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా అందరి హీరోల సరసన నటించి.. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.

నయనతార
నయనతార

డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహమాడి.. ఇద్దరు పిల్లకు తల్లిగా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. ప్రస్తుతం నయనతార.. ఏ హీరోయిన్ తీసుకోనంత రెమ్యూనరేషన్ అందుకుంటుంది. మాములుగా రూ. 10 కోట్లు.. జీఎస్టీ తో కలిపి అమ్మడికి రూ. 11 కోట్లు ఇస్తున్నారట. జవాన్ కు కూడా అమ్మడు అంతే తీసుకుందని టాక్. ఇక తరువాత సినిమాలకు ఈ భామ మరింత పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అంత డిమాండ్ చేసినా కూడా నిర్మాతలు నయన్ ను కళ్ళకద్దుకొని తీసుకుంటున్నారట.

దానికి కారణం ఆమె అంత స్టార్ ఎవరు లేరు. అంతేకాకుండా ఆమెకు ఆల్టర్ నేట్ హీరోయిన్ కూడా దొరక్కపోవడంతో నిర్మాతలు ఆమె ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి సిద్దమవుతున్నారట. బాలీవుడ్ లో సైతం జవాన్ తరువాత ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెమ్యూనరేషన్ చూసి చిన్న చిన్న నిర్మాతలు అంత పెంచితే తట్టుకొనేది ఎలా అంటూ లబోదిబోమంటున్నారట. ఏదిఏమైనా నయన్ రేంజ్ అలాంటింది మరి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here