Nayanatara : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ నయనతార. ఇటీవల, ఆమె బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌తో జతకట్టి జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆమె రూ.1000 కోట్ల సినిమా చేసి బాలీవుడ్ పరిశ్రమలో కూడా పేరు తెచ్చుకుంది.

ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఆమెకు అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న నయనతార.. రెమ్యునరేషన్ విషయంలోనూ తగ్గేదేలే అంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. చిత్ర నిర్మాతలు కూడా ఆమె ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా నయనతార తమిళ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసీ అనే సినిమా చేయనుంది. టైటిల్ అనౌన్స్ చేయడంతోనే సినిమా వివాదంలో చిక్కుకుంది. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ టైటిల్ పై కోర్టును ఆశ్రయించింది అంతేకాకుండా నిర్మాతలతో నయనతారకు విభేదాలు రావడంతో ఈమె ఏకంగా ఈ సినిమా నుంచి తప్పుకోవాలని ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది. తన భర్త దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నయనతార నటించడం లేదని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. కానీ ఈ విషయంపై క్లారిటీ లేదు. ఈ సినిమా నయన్ – విఘ్నేష్ ల మధ్య చిచ్చుపెట్టేలా ఉంది అంటున్నారు అభిమానులు..!!