ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత పెద్ద స్థాయికి వెళ్లిన హీరోలు మన టాలీవుడ్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. అలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోలందరికీ మెగాస్టార్ చిరంజీవి రోల్ మోడల్. ఆయనని ఆదర్శంగా తీసుకొని నేటి తరం హీరోలలో మాస్ మహారాజ రవితేజ వచ్చి గ్రాండ్ సక్సెస్ అయ్యాడు.

ఆయన తర్వాత ఆ రేంజ్ చూసింది న్యాచురల్ స్టార్ నాని మాత్రమే. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ఆ చిత్రం పెద్ద సక్సెస్ సాధించడం తో నాని మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ఆయన వంద కోట్ల రూపాయిల వసూళ్లను కొల్లగొట్టే రేంజ్ కి తన మార్కెట్ ని పెంచుకున్నాడు.

ఇదంతా పక్కన పెడితే నాని మరియు నితిన్ ఇద్దరూ కూడా ఒకే క్యాటగిరీ కి చెందిన హీరోలు. వీళ్లిద్దరు హీరోలు గా నటించిన ‘హాయ్ నాన్న’ మరియు ‘ఎక్స్ స్ట్రా ఆర్డినరీ మెన్’ చిత్రాలు ఒక్కరోజు గ్యాప్ తో విడుదల అవుతున్నాయి. ఈ సందర్భంగా నితిన్ తన సినిమా కోసం ఇస్తున్న ప్రొమోషన్స్ లో నాని తో తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘నేను హీరో గా నటించిన అల్లరి బుల్లోడు సినిమాకి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు. మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్స్ బాబు గారు అంటూ పిలుస్తారు, కానీ నాని మాత్రం నన్ను నితిన్ అని పిలిచేవాడు. అది నాకు చాలా నచ్చేది, ఒకరోజు నిర్మాతలు హీరో ని అలా పేరు పెట్టి పిలవద్దని నాని కి చెప్పారు, కానీ నేను ఏమి కాదు, అలాగే పిలువు అని చెప్పాను. ఇంకా అవసరం అయితే ‘నీత్స్’ అని కూడా పిలువు అన్నాను, అప్పటి నుండి నాని నన్ను ‘నీత్స్’ అనే పిలుస్తుంటాడు ‘ అని చెప్పుకొచ్చాడు నితిన్.
