Naresh Pavitra : సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన వార్త నరేష్ – పవిత్రా లోకేష్ రిలేషన్.. ఈ విషయం పై ఎన్ని వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నవరస రాయ డాక్టర్ నరేష్, నటి పవిత్ర లోకేష్ జంటగా కొత్త సినిమా రాబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది…అయితే తాజాగా సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను, గ్లింప్స్ ను అలాగే రిలీజ్ పైనా అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు కథ అందించడంతో పాటు డైరెక్ట్ చేశారు.

అయితే, విజయకృష్ణ బ్యానర్ 50 స్వర్ణ సంవత్సరాలు, అలాగే నటుడిగా నరేష్ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగు మరియు కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంతో లెజెండరీ ప్రొడక్షన్ బ్యానర్ ను విజయ్ కృష్ణ రూపొందించడం విశేషం.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను, టైటిల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే..ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో సాంప్రదాయ దుస్తులలో నరేష్ – పవిత్రా ఆకట్టుకుంటున్నారు. గ్లింప్స్ లో పవిత్రా తమ ఇంటి ముందు ముగ్గేస్తుంటే నరేష్ దగ్గరగా వచ్చి చూసే సీన్ ఆకట్టుకుంటోంది.. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..
నరేష్ – పవిత్ర బ్యూటీఫుల్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వినసొంపుగా ఉంది. చిత్రంలో జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఆయా పాత్రల్లో అలరించబోతున్నారు. అదేవిధంగా సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న చిత్రానికి జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు… ఈ సినిమా గురించి వచ్చిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..