Naresh : తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పలు సినిమాల్లో రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లోని సినిమా కూడా ఒకటి. కానీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూసినా.. ఈ సినిమా కోసం కనీసం మూడేళ్లు అయినా వెయిట్ చేయక తప్పదు. ఇక ఇప్పటికీ ఈ మూవీ గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రాలేదు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. తాజాగా సీనియర్ యాక్టర్ నరేశ్.. మహేశ్ బాబు, రాజమౌళి సినిమా గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
నరేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఫ్యాన్స్ కూడా అంగీకరిస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తే చూడాలని టాలీవుడ్ లవర్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యింది. ప్రాజెక్ట్ ఓకే అయ్యి కూడా ఏడాదిన్నర అవుతున్నా.. ఈ మూవీ గురించి రూమర్స్ తప్పా కన్ఫర్మ్‌గా పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రావడం లేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఈ మూవీకి రైటర్‌గా పనిచేస్తున్నారు.
=ఆయన మాత్రమే మహేశ్‌తో జరుగుతున్న ప్రాజెక్ట్ గురించి అప్పుడప్పుడు కొన్ని అప్డేట్స్ బయటపెడుతున్నారు. తాజాగా మహేశ్ సోదరుడు నరేశ్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి స్టేట్‌మెంట్ ఇచ్చారు. మహేశ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. మహేశ్ బాబుకు క్లాస్‌తో పాటు మాస్ ఆడియన్స్‌లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉందని నరేశ్ గుర్తుచేసుకున్నారు.
ప్రపంచానికి ఇండియన్ సినిమాను పరిచయం చేసింది రాజమౌళినే అని ప్రశంసించారు. తెలుగు సినిమా స్థాయిను వీరి సినిమా వేరే లెవెల్‌కు తీసుకెళుతుందని ఆశిస్తున్నాను అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు నరేశ్. ఆయన చెప్పిన మాటలతో మహేశ్ ఫ్యాన్స్ అంగీకరిస్తున్నారు. నిజంగానే ఈ సినిమా.. రాజమౌళి, మహేశ్ స్థాయిని మరింత పెంచాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పటివరకు మహేశ్‌కు తెలుగులో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగాలని తెలుగు అభిమానులు ఆశిస్తున్నారు.