Rasmika Mandanna : ను ఒకప్పుడు నాని బెదిరించాడా.. పాపం వణికిపోయిందిగా..!

- Advertisement -

Rashmika Mandanna : ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకే ఒక్క అమ్మడి పేరు వినిపిస్తుంది ఆ చిన్నదే రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అలాగే వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

 

ఆ తర్వాత రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తూ అదరగొడుతోంది రష్మిక. తెలుగు, తమిళ్ఎం హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇదిలా ఉంటే రష్మిక మందన్న కు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో రష్మిక మందన్నాను నేచురల్ స్టార్ నాని గాన్ తో బెదిరిస్తూ కనిపించారు. నాని రష్మిక కలిసి ఓ సినిమాలో నటించారు.

- Advertisement -

దేవదాసు అనే సినిమాలో రష్మిక, నాని కలిసి నటించారు. ఇదే సినిమాలో నాగార్జున కూడా నటించారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతోన్న వీడియో ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలోది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో నాని రష్మికాను నీ ఫెవరెట్ కో స్టార్ ఎవరు అని అడిగారు. దాంతో నాగార్జున కూడా రష్మికాను బెదిరించారు.

విజయ్ దేవరకొండ, నాగ శౌర్య , నాని ఈ ముగ్గురిలో ఎవరు నీ ఫెవరెట్ అని అడిగారు. రష్మిక తడబడుతుంటే నాని అక్కడ టేబుల్ పై ఉన్న గాన్ తో ఆమెను బెదిరించారు. దాంతో రష్మిక నాని పేరు చెప్పింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here