ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ లో అయినా మేకర్స్ ఎక్కువగా పాన్ ఇండియన్ సబ్జక్ట్స్ మీదనే ప్రధానంగా ద్రుష్టి సారిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచి కథ ని బాషా ప్రాంతం తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రీసెంట్ గా అలా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన చిత్రాలు ఇండస్ట్రీ లో ఎన్నో ఉన్నాయి. అయితే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టినంత మాత్రాన పలానా హీరోకి కానీ, హీరోయిన్ కానీ ఆ భాషల్లో స్టార్ ఇమేజి వచ్చేసినట్టు కాదు.

కేవలం కంటెంట్ కారణంగానే అలా సక్సెస్ అవుతాయి. హిందీ , తమిళం వంటి భాషల్లో హిట్స్ కొట్టిన తెలుగు హీరోల తదుపరి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన ఫెయిల్యూర్స్ గా నిలవడం ఇది వరకు మనం ఎన్నో చూసాము. కానీ కొంతమంది హీరోలు మాత్రం ప్రతీ భాషలోనూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నారు. అలాంటి హీరోలలో ఒకడు దుల్కర్ సల్మాన్.

గత ఏడాది ఈయన తెలుగు లో ‘సీతారామం’ అనే చిత్రం చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తెలుగు లో మాత్రమే కాదు, తమిళం మరియు హిందీ లో కూడా ఇదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘కింగ్ ఆఫ్ కోత’ అనే సినిమాతో మన ముందుకి రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా విచ్చేశాడు.

ఆయన మాట్లాడుతూ ‘నా దృష్టిలో పాన్ ఇండియన్ హీరో అంటే దుల్కర్ సల్మాన్ మాత్రమే. ఒక తెలుగు డైరెక్టర్ ఆయన కోసం కథ రాసుకుంటాడు, ఒక తమిళ డైరెక్టర్ ఆయన కోసం కథ రాసుకుంటాడు, ఒక మలయాళం డైరెక్టర్ ఆయన కోసం కథ రాసుకుంటాడు. అందుకే ఆయన నిజమైన పాన్ ఇండియన్ స్టార్ మిగిలిన హీరోలు కాదు’ అంటూ చెప్పొకొచ్చాడు. ఇది ఇప్పుడు పెద్ద వివాదం కి దారి తీసింది, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు నాని పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Among the actors I know, I consider only Dulquer Salmaan as a PAN India actor. – Nani at #KingOfKotha Event pic.twitter.com/bXgFfHLwD4
— Aakashavaani (@TheAakashavaani) August 13, 2023