ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకు వచ్చిన నటి శ్రీరెడ్డి తర్వాత అనూహ్యంగా కనుమరుగైంది. చెన్నైకి వెళ్లి అక్కడ తన సొంత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. ఈ క్రమంలో సమయం చిక్కినప్పుడల్లా సెలబ్రెటీలపై బూతు పురాణం ఎత్తుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో నాని పై నటి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్ చేసింది.
ఆర్జేగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరియర్ స్టార్ చేసి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్టీలో అడుగుపెట్టి సక్సెఫుల్ హీరోగా రాణిస్తున్నారు నాని. అతి తక్కవ కాలంలోనే వరుస హిట్ సినిమాలతో నేచురల్ స్టార్‌గా మారి స్టార్ హీరోలకు గట్టిపోటీ అయ్యారు. ఇన్నేళ్ల సినీ కెరియర్‌లో వివాదాలకు దూరంగా ఉన్న నానిపై సంచలన ఆరోపణలు చేస్తూ అతడ్ని తన డర్టీపిక్చర్ వివాదంలోకి లాగింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. తనను నాని ప్రేమించాడని ఆరోపించింది. నమ్మించి మోసం చేశాడని తెలిపింది. తాజాగా వీరిద్దరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో నాని అభిమానులు శ్రీరెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్నారు.
అలాగే ఇప్పటికే చాలామంది బడా హీరోల వల్ల తాను మోసపోయానని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పింది. అలాంటి హీరోయిన్ అవకాశం ఇస్తానని చెప్పి స్టార్ హీరో నాని (Nani) తనతో శారీరకంగా పడుకున్నాడు అంటూ గతంలో సంచలన ఆరోపణలు చేసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే..శ్రీ రెడ్డి హీరోయిన్ అవదామని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సింగర్ గీత మాధురి భర్త నందుతో నాన్న నేను అబద్ధం అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాతో అంతగా గుర్తింపు రాని శ్రీరెడ్డికి ఆ తర్వాత అవకాశాలు రాలేదు.