Dasara Trailer Review : న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు.. ఎప్పుడు స్మార్ట్గా న్యాచురల్ లుక్ లో కనిపించే నాని ఇప్పుడు ఊరమాస్ అవతారం, గూజ్ బంప్స్ కలిగించే యాక్షన్ సీక్వెన్సెస్, శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న లిరికల్ సాంగ్స్… తో “దసరా” పాన్ ఇండియా మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను ఈ నెల 30 న విడుదల చేయనున్నారు.. ఈ మేరకు ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు..ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న నానికి ఈ సినిమా ఆ రేంజ్ సక్సెస్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా నుంచి ట్రైలర్ ఈరోజు రాబోతుందని హింట్ ఇచ్చారు మేకర్స్… తాజాగా దసరా ట్రైలర్ రిలీజ్ అయ్యింది..

సినిమాలో నాని విశ్వరూపం మాత్రమే కాదు హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ నటన కూడా అద్భుతంగా ఉంటుందట.ముఖ్యంగా సినిమాలో రెండు సీన్స్ లో కీర్తి సురేష్ మరోసారి తన నటనా ప్రతిభతో అదుర్స్ అనిపిస్తుందని టాక్..గతంలో వీరిద్దరూ కలిసి నేను లోకల్ సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కాగా మరోసారి ఈ కాంబో సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.నాని కీర్తి సురేష్ ఇద్దరు దసరా సినిమాకు తమ బెస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. అంతేకాదు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తొలి సినిమానే అయినా సినిమాను చాలా క్లవర్ గా డీల్ చేసినట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో నాని దసరా సినిమాలో తన సత్తా చాటాలని చూస్తున్నాడు..

ప్రీ రిలీజ్ బజ్ అయితే అంచనాలను పెంచుతుండగా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో పీరియడికల్ గా తెరకెక్కిన దసరా సినిమా నాని కెరీర్లోనే హైహెస్ట్ బడ్జెట్ తో వస్తుంది. బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగగా.. నాని దసరా ఏమేరకు అంచనాలు అందుకుంటుందో చూడాలి. సినిమాని మాత్రం హిందీ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. టీజర్ తోనే వావ్ అనిపించిన నాని దసరా ట్రైలర్ అంతకు మించి ఉంది.. ఒక్కమాటలో చెప్పాలంటే మాస్, యాక్షన్, ఎమోషన్స్ ను కగిలిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. ప్రతి డైలాగు గూస్ బంబ్స్ తెప్పిస్తుంది..మొత్తానికి ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..
సినిమా: దసరా
రిలీజ్ డేట్ : 30 మార్చి 2023
కథ: యాక్షన్ అడవెంచర్ డ్రామా
నటీ నటులు : నాని, కీర్తి సురేష్, సముద్రఖని, ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, షమ్నా కాసిం, సజోల్ చౌదరిమోర్…
డైరెక్టర్ : శ్రీకాంత్ ఓదెల
రచయిత : శ్రీకాంత్ ఓదెల
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్