Dasara first week collections న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’.. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోకే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా కళ్ళు చెదిరే ఓపెనింగ్ వచ్చింది. కానీ రెండవ రోజు నుండి మాత్రం వసూళ్లు ఏపీలో బాగా పడిపోయాయి..

ఇక తెలంగాణలో మాత్రం అదే జోరుతో వసూళ్లను రాబడుతుంది..తెలంగాణ లో ఈ సినిమా ఇప్పటికే 20కోట్లకు పైగా రాబట్టింది.. ఇక అమెరికాలో దూసుకుపోతుంది..ఇప్పటికే రెండు మిలియన్ల డాలర్స్ క్లబ్ లోకి చేరేందుకు సిద్ధం గా ఉంది.మిగితా అన్ని చోట్ల దసరా కలెక్షన్స్ దుమ్ము దులుపుతున్నాయి.. కానీ ఏపీలో మాత్రం సినిమాకు అంత టాక్ రాలేదు.. కలెక్షన్స్ కూడా చెప్పుకొదగ్గ స్థాయిలో రాలేదని చెప్పాలి..వీకెండ్ పై ట్రేడ్ భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాలోని కొన్ని ప్రాంతాలలో బయ్యర్స్ సేఫ్ అయ్యేలా కనిపించట్లేదనే టాక్ వినిపిస్తుంది…ఇప్పటి వరకు ఈ సినిమా మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు సమాచారం..
మొదటి రెండు రోజులు ఓపెనింగ్స్ ఊహించని రీతిలో అయ్యాయి..నాని మొదటి షో తో తెలంగాణాలో మంచి బోణి కొట్టాడు.. కానీ ఏపీలో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు.. కనీసం చెప్పుకొనే విధంగా పాజిటివ్ టాక్ కూడా రాలేదని తెలుస్తుంది..మరి ఎందుకు సినిమాను జనాలు చూడలేక పోతున్నారో అని ఇండస్ట్రీలో గుసగుసలు గుసగుసలు వినిపిస్తున్నాయి… ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం వంద కోట్ల క్లబ్ లోకి చేరబోతుందని తెలుస్తుంది.. ప్రస్తుత్తానికి అయితే నాని హిట్ టాక్ ను అందుకున్నాడు.. ఇకపోతే నాని మరో మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది.. వచ్చే ఏడాది భారీగా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం..