Priyanka : సెలెబ్రేటీలకు సంబంధించిన గుసగుసలు అంటే చాలా మంది చెవులు కోసుకుంటారు.. ఆ సెలెబ్రేటీలు సీక్రెట్ లవ్ ఎఫైర్ లు, పెళ్లిళ్లు గురించి తెలుసుకోవడానికి జనాలు కూడా ఆసక్తి చూపిస్తారు. సోషల్ మీడియా గురించి ఈ మధ్య జనాల్లో ఎక్కువగా వినిపిస్తుంది..సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియా వారధిగా నిలుస్తోంది. నేటి కాలంలో సామాన్యుల ఇళ్లల్లో జరిగే వివాహాలే ఎంతో ఆడంబరంగా జరుగుతున్నాయి. అలాంటిది.. సెలబ్రిటీల పెళ్లి అంటే మాటలా.. చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం.. చాలా సీక్రెట్‌గా, సింపుల్‌గా పెళ్లి పీటలు ఎక్కి.. ఆ తర్వాత తమ మ్యారేజ్ ఫొటోలు షేర్ చేసి.. షాకిస్తారు. ఇక తాజాగా టాలీవుడ్ బుల్లి తెర నటి ఒకరు ఇలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. అది కూడా విదేశాల్లో. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మెప్పించిన ప్రియాంక నల్కారి పేరు వినే ఉంటారు. .బాలనటిగా పలు సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత కూడా కొన్ని సీరియల్స్‌లో కీలక పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందింది. ఈటీవీ ప్లస్‌లో ప్రసారం అయిన ‘సినిమా చూపిస్తా మామ’ షోకి జబర్దస్త్ శ్రీనుతో కలిసి యాంకర్‌గా సందడి చేసింది. కానీ ఆ షో పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో.. ప్రియాంకకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగులో సరైన అవకాశాలు లభించకపోవడంతో.. చివరికి ఆమె తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె తమిళ్‌లో నటిస్తోన్న రోజా సీరియల్.. అక్కడ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంది. దాంతో ప్రియాంక పాపులారిటీ బాగా పెరిగింది..
గురువారం ఆమె తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది..తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. ఆ ఫొటోలను చూసిన ఫాలోవర్లు.. ఇంత సడెన్‌గా.. అందులోనూ సీక్రెట్‌గా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది అంటూ ఆరా తీస్తూనే ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రియాంక తన ఇన్‌స్టా స్టేటస్‌లో కూడా పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాక ప్రియాంక తన కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ఈ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మలేషియాలోని మురుగన్ ఆలయంలో ప్రియాంక పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.. గతంలో వీరికి ఎంగేజ్మెంట్ అయ్యింది.. అయితే సీరియల్స్ తో బిజీ కావడం తో ఇప్పుడు సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..