Naga Chaitanya : సమంత, చైతన్య విడిపోయినప్పటి నుంచి వీరిద్దరూ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సమంతను రెండో పెళ్లి చేసుకోమని ఇంట్లో బలవంతం చేస్తోందని.. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక కొన్నాళ్లుగా సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిందని టాక్. అయితే అందులో నిజం లేదని తేలింది. సమంతను పక్కన పెట్టి.. అయితే ఈసారి నాగ చైతన్య పెళ్లి ఫిక్స్ అయిందనే వార్త వైరల్ గా మారింది.
ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయిని నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. బయట చెప్పకున్నా.. పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు పెళ్లి వద్దు అని చెప్పిన నాగ చైతన్య కూడా.. ఇప్పుడు మీ ఇష్టం నాన్న.. పెళ్లి నిర్ణయాన్ని తండ్రికే వదిలేసినట్లు తెలుస్తోంది.

ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ చైతన్య రెండో పెళ్లి వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు చైతూ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు.

మరి ఇది ఎంత వరకు నిజం. నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తాండల్ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మరి ఈ వార్తలపై అక్కినేని కుటుంబం స్పందిస్తుందో లేదో చూడాలి.