బిగ్ బాస్ : నీ ఆటలే కాదు.. మాటలు కూడా గలీజ్ గా ఉన్నాయి.. గౌతమ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..

- Advertisement -

బిగ్ బాస్ : వారాంతం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ హౌస్ లో సందడి రెట్టింపు అవుతుంది. కింగ్ నాగార్జున స్టేజ్ పైకి వచ్చి హౌస్ లో ఉన్న వారితో గేమ్స్ అందించడంతో పాటు సరిగ్గా ఆడని వారికి క్లాస్ కూడా తీసుకుంటాడు. శనివారం రోజు కూడా కింగ్ నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి హౌస్ లో ఉన్న వారి ఆట తీరు గురించి తెలిపాడు. కింగ్ మీటర్ అంటూ ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారో చూపించి క్లాస్ తీసుకున్నాడు. గౌతమ్ కృష్ణ, ప్రిన్ యావర్ గొడవ పెట్టుకోవడంతో తన మీదకు రాకుండా రతిక నాటకాలు కూడా ఆడింది. శనివారం నాగార్జున ఇదే ప్రస్తావన తీసుకొచ్చి నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చాడు.

బిగ్ బాస్
బిగ్ బాస్

గేమ్ ఆడు మనుషులతో ఆడుకోకు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు . అలాగే ఆమె గేమ్ కూడా అంతగా ఆడటం లేదు అంటూ సీరియస్ అయ్యాడు. అంతకు ముందు ప్రిన్స్ కు గౌతమ్ కు మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ.. గౌతమ్ పై సీరియస్ అయ్యాడు నాగ్. అంతకు ముందు మాయాస్త్ర టాస్క్ లో గౌతమ్ కు ప్రిన్స్ కు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ప్రిన్స్ పెద్ద పెద్దగా అరుస్తూ.. ఏడుస్తూ నేను వెళ్ళిపోతా అంటూ హంగామా చేశాడు. గౌతమ్ కూడా ప్రిన్స్ పై మాటల దాడి చేశాడు. గౌతమ్ ప్రిన్స్ బాడీ గురించి మాట్లాడుతూ.. స్టెరాయిడ్స్ వాడి బాడీ పెంచాడు అని అన్నాడు దాని ప్రిన్స్ చాలా బాధపడ్డాడు. ఏడ్చినంత పని చేశాడు.

Gautham

దాంతో నాగార్జున డాక్టర్ అయినంత మాత్రాన నీకు అన్ని తెలిసిపోతాయా అని సీరియస్ అయ్యాడు. నువ్వు కూడా బాడీ పెంచావు గా నువ్వు కూడా స్టెరాయిడ్స్ వాడి పెంచావా అని ప్రశ్నించాడు నాగ్. దాంతో గౌతమ్ ప్రిన్స్ కు సారి చెప్పాడు. మళ్లీ ఇలాంటివి రిపీట్ చేయను అని చెప్పాడు గౌతమ్. ఇక ఈ వారం నామినేషన్స్ నుంచి పవర్ అస్త్ర పొందడం తో శివాజీ ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నారు. ఆతర్వాత అమర్ దీప్ సేవ్ అయ్యాడు . మిగిలిన ఏడుగురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. మరి హౌస్ లో నుంచి బయటకు వచ్చేది ఎవరు అన్నది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here