టాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల రిలేషన్లు ఎప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంటాయి. ”ఆ హీరో హీరోయిన్ రిలేషన్‌లో ఉండేవారు. ఓ హీరో, హీరోయిన్ రిలేషన్‌లో ఉంటున్నారు” అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అలా వచ్చిన వార్తల్లో నాగార్జున, టబు రిలేషన్ ఒకటి. వీరిద్దరు పది సంవత్సరాలకు పైగా అఫైర్ కొనసాగించారని.. అయితే అమలను వదిలి నాగార్జున రాలేడని తెలుసుకున్న టబు.. నిదానంగా ఆమే దూరంగా వెళ్లిందన్న టాక్ అప్పట్లో నడిచింది.

అంతేకాదు నాగార్జున ఇంట్లోనే టబు ఉండేదని గాసిప్‌లు వచ్చాయి. ఇక ఈ రూమర్లను వారిద్దరు ఖండించకపోవడంతో అవి నిజమేనని చాలామంది నమ్మేవారు. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ .. తెరపై వీళ్ళ కెమిస్ట్రీ అదుర్స్ ..తెర వెనక అమలా తో ఎలా ఉంటాడో తెలియదు కానీ.. తెర పై మాత్రం టనుతో రెచ్చిపోయి ఓ రేంజ్ లో నటించేస్తాడు నాగార్జున . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..నాగచైతన్య – అక్కినేని ఫ్యామిలీకి డబ్బుకి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

“మా ఫ్యామిలీకి టబు గారితో మంచి రిలేషన్ షిప్ ఉంది . నేను మా నాన్న మా తమ్ముడు అందరూ అంటే ఆమెకు చాలా ఇష్టం. చాలా మంచి హెల్తీ రిలేషన్షిప్ మా మధ్య కొనసాగుతుంది . ఇప్పటికీ ఆమె ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన మా ఇంట్లోనే ఉంటుంది . మమ్మల్ని మీట్ అవ్వకుండా వెళ్ళనే వెళ్ళదు. చాలా మంచి ఆవిడ. మా అక్కినేని కుటుంబం మొత్తానికి ఆమె నా చిన్నతనం నుంచి ఎంతో క్లోజ్ గా ఉండేరు. ఇప్పటికీ కూడా ఏదైనా పండగల సమయంలో మా అందరికీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు టబు..” అంటూ ఓ రేంజ్ లో పొగడేశాడు.