Naga Shaurya టాలీవుడ్ లో మొదటి నుండి కాంబినేషన్ ద్వారా వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటూ వచ్చింది.కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే జనాలు థియేటర్స్ కి కదులుతున్నారు.ఈమధ్య కాలం లో విశ్లేషకులు సైతం బాగా గమనించిన విషయం ఇది.నిన్న విడుదలైన ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’ సినిమా అందుకు ఉదాహరణ.గతం లో నాగ శౌర్య మరియు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రం వచ్చింది.
అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్.మళ్ళీ అదే కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే ఈ ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’ అనే సినిమా.నిన్న విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చింది.కానీ కాంబినేషన్ కాబట్టి కనీస స్థాయి వసూళ్లు అయినా వస్తాయని ఆశించిన ట్రేడ్ పండితులకు ఊహించని షాక్ ని ఇచ్చింది ఈ చిత్రం.
ఎందుకంటే ఈ సినిమా ప్రధాన సిటీస్ మరియు టౌన్స్ లో కూడా కనీస స్థాయి వసూళ్లను రాబట్టలేక చతికల పడింది.చాలా చోట్ల ఈ చిత్రానికి షేర్ కాదు కదా, కనీసం గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా కేవలం 85 లక్షల రూపాయిల గ్రాస్ ని మాత్రమే వసూలు చేసిందట.షేర్ కేవలం 30 లక్షల రూపాయిలు మాత్రమే వచ్చిందని అంచనా వేస్తున్నారు.ఇంత పెద్ద డిజాస్టర్ ఓపెనింగ్ వస్తుందని ట్రేడ్ వర్గాలు సైతం ఊహించలేదు.
ఎందుకంటే నాగ శౌర్య గత చిత్రం ‘కృష్ణా వృందా విహారి’ మొదటి రోజు దాదాపు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.ఇది కాంబినేషన్ లో వస్తున్న సినిమా కదా, కనీసం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని అయినా మొదటి రోజు రాబడుతుందని అంచనా వేశారు.కానీ అంచనాలు తలక్రిందులు అయ్యాయి.ఫుల్ రన్ లో కనీసం కోటి రూపాయిల కలెక్షన్స్ ని అయినా రాబడుతుందో లేదో చూడాలి.