Naga Chaitanya గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అక్కినేని మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఎంతో గ్రాండ్ గా జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. తర్వాత ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అనంతరం 100% లవ్ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. ఏ మాయ చేసావే సినిమా చేస్తున్నప్పుడే సమంతతో లవ్ లో పడిపోయి ఇద్దరు 2017లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్న మనస్పార్ధాలు కారణంగా 2021 డిసెంబర్ లో డివోర్స్ తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి కెరీర్ వారు చూసుకుంటూ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్స్ శోభిత ధూళిపాళ్ల తో చైతు ఎఫైర్ కొనసాగిస్తున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి.

ఇటీవల ఓ హోటల్ లో వారిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు. ఇప్పటికీ వీరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలకు బలం చేకూరింది. సమంత, శోభిత కంటే ముందే నాగ చైతన్య ఓ అమ్మాయిని ప్రేమించాడట. ఈ విషయాన్ని నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదు తనతో ఓ చిలిపి పని చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి తిట్లు కూడా తిన్నాడట. అతను కాలేజీ చదువుకునే సమయంలో ఒక అమ్మాయికి కారులో ముద్దు పెట్టాడట.. అప్పుడే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయానంటూ చెప్పుకొచ్చాడు. ఇది విన్న జనాలు ఎంట్రా బాబు ఇంత కక్కుర్తిలో ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.