Samantha : విడాకుల తరువాత తాము మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పిన నాగచైతన్య, సమంత.. ఇప్పటివరకు ముఖముఖాలు కూడా చూసుకోలేదు. కనీసం బయట ఎదురైంది కూడా లేదు. విడాకుల తరువాత నుంచి వీరిద్దరూ వారి వారి కెరీర్లను సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. చై సినిమాలతో బిజీ అవ్వగా.. సామ్ మయోసైటిస్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది. అందుకోసం ఒక ఏడాది సినిమాలను కూడా పక్కన పెట్టింది.

ప్రస్తుతం టిబెట్ లో సామ్.. చికిత్స తీసుకుంటుంది. ఇక వీరి గురించి ఎప్పుడు న్యూస్ వచ్చినా కూడా నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా నాగ చైతన్య మాజీ భార్య సమంత గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైకు.. మీరు నటించిన హీరోయిన్స్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి అనే ప్రశ్న ఎదురయ్యింది. అందులో కృతి శెట్టి, పూజా హెగ్డే పేర్లతో పాటు సమంత పేరు కూడా ఉండడంతో చై.. సామ్ గురించి మాట్లాడాడు.

‘‘సమంత ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తిచేస్తోంది. ఆమెకు విల్ పవర్ ఎక్కువ. చాలా హార్డ్ వర్కర్.. ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సామ్.. ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో చై గురించి మాట్లాడుతూ.. అతను తన మాజీ భర్త అని, ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటే కత్తితో పొడుస్తాను అని ఘాటు ఆరోపణలు చేసింది. కానీ, చై మాత్రం ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో సామ్ గురించి అడిగినా అడిగినా చాలా పాజిటివ్ గా సమాధానం చెప్పడం.. ఆయన అభిమానులను ఫిదా చేస్తోంది.