Anasuya : అనసూయను ఏకిపారేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.. దెబ్బకు దిగొచ్చిందిగా..

- Advertisement -

Anasuya : ‘పుష్ప : ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సక్సెస్ ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అందులో కమెడియన్ సునీల్, అనసూయ భరద్వాజ్ నెగటివ్ రోల్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనసూయ ఈ సినిమాలో దాక్షాయిని పాత్రలో గెటప్ తో పాటు యాక్టింగ్ తోను అదరగొట్టింది. ‘పుష్ప’ లో నటించిన అనసూయ భరద్వాజ్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ‘పుష్ప 2’ గురించి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Anasuya
Anasuya

దీంతో బన్నీ ఫ్యాన్స్ అనసూయను టార్గెట్ చేస్తూ ట్వట్లు పెట్టారు. దెబ్బకు దిగొచ్చిన ఈ అమ్మడు తాను అలా అనలేదంటూ రాసుకొచ్చింది. అసలేంటీ కథ అంటే.. “అల్లు అర్జున్ ‘పుష్ప-1’ ఫీడ్ బ్యాక్ మొత్తం తీసుకున్నారు. ప్రతి విషయానికి ఆయన స్పందించకపోవచ్చు. కానీ సామాజిక మాధ్యమాల్లో వచ్చే కామెంట్స్ ని చూస్తారు. ముఖ్యంగా డాన్స్ మూమెంట్స్ పై వచ్చిన కామెంట్స్ ను పరిగణలోకి తీసుకొని ‘పుష్ప 2’లో వాటిపై మరింత దృష్టి పెట్టనున్నారు. కేవలం డాన్స్ మాత్రమే కాదు తొలి భాగంలో లోపాలను కూడా గుర్తించి అలాంటివి రెండో భాగంలో రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నా పాత్ర విషయంలోనూ ఆయనకు ఫిర్యాదు వచ్చింది. ముఖ్యంగా నాతోపాటు ఫహాద్ పజిల్, సునీల్, బ్రహ్మాజీ పాత్రల మధ్య ఎక్కువ సన్నివేశాలుంటాయి. పుష్ప: ది రైజ్’ కి మించి పుష్ప: ది రూల్’ ఉంటుంది” అని అనసూయ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు న్యూస్ వైరల్ అయింది. దీంతో ఈ న్యూస్ పై అనసూయ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “అందులో ఎలాంటి నిజం లేదు. నేను అసలు అలా చెప్పలేదు. నా వ్యాఖ్యలను ఎవరో తారుమారు చేశారు” అంటూ రాస్కొచ్చింది. దీంతో అనసూయ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here