కృతి శెట్టి.. ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో నాగ చైతన్య ఒకరు ఈ యువ హీరో తాజాగా కస్టడీ అనే సినిమా లో హీరో గా నటించాడు కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించ గా ప్రియమణి అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు ఈ మూవీని మే 12వ తేదీన తెలుగు మరియు తమిళ భాష ల్లో విడుదల చేయనున్నారు ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వరుస ప్రమోషన్లతో దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన ఉప్పెన భామ నటించిన విషయం తెలిసింది. సినిమా ప్రచారంలో భాగంగా నాగచైతన్య కృతి గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పాడు. ఇంటర్వ్యూ లో నాగచైతన్య కృతి శెట్టి గురించి మాట్లాడుతూ … ఆమె పెన్ను మరియు పేపర్ ను పట్టు కొని సెట్స్ కు వస్తుంది. పాత్ర నేపథ్యం నుండి మేనరిజం వరకు ఆమె పేపర్ పై రాసుకుంటుంది. ఆమె ఇంటికి వెళ్లి మరుసటి రోజు పేపర్లో సందేహాలు మరియు ప్రశ్న లతో సెక్స్కు వస్తుంది. ఇలా కృతి శెట్టి ఒక ప్రణాళిక ప్రకారం సినిమాలో నటిస్తుంది. అని నాగచైతన్య చెప్పకనే చెప్పాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే నాగ చైతన్య కృతి శెట్టి తో కలిసి బంగారు రాజు మూవీలో నటించాడు. ఇది వీరి కాంబినేషన్లో రెండవ సినిమా కస్టడీ.

ఇక గతంలో కృతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులో కోరిక బయటపెట్టింది. సినిమాలో తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతుందంట. ఈ కోరిక నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నారు. కాకపోతే కీర్తి సురేష్, సాయిపల్లవి లాంటి కథానాయికలు తెలుగు సరిగ్గా రాకపోయినా నేర్చుకుని మరి డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే కృతి శెట్టి కూడా సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడుతోంది. ఫ్యూచర్ లో తప్పకుండా చేసి చూపిస్తాను అంటుంది.