Naga Chaitanya అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన నాగ చైతన్య, ఏనాడు కూడా తన తండ్రిని కానీ, తాతయ్య ని అనుకరించలేదు.తన సొంత స్టైల్ లోనే సినిమాలు చేసుకుంటూ ఎన్నో సూపర్ హిట్స్ , బ్లాక్ బస్టర్స్ అందుకొని ఇండస్ట్రీ లో క్రేజీ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.అయితే ఇంత రేంజ్ కి వచ్చి కూడా నాగ చైతన్య కొద్దిరోజులు ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా..?, కానీ కొంతకాలం వరకు ఆయనకీ ఆ పరిస్థితి ఏర్పడింది.

ఎప్పుడంటే సమంత తో విడాకులు తీసుకున్న కొత్తల్లో.పెళ్ళైన తర్వాత వీళ్లిద్దరు ప్రముఖ సీనియర్ నటుడు మురళి మోహన్ అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేశారు.ఆ ఫ్లాట్ మొత్తానికి సమంత నే డబ్బులు చెల్లించింది.అయితే విడాకులు జరిగిన తర్వాత నాగ చైతన్య ఆ ఫ్లాట్ నుండి బయటకి వచ్చేసాడు.ఆ సమయం లో ఆయన కమిట్మెంట్ అయినా సినిమాలు రెమ్యూనరేషన్స్ ఇంకా ఎవ్వరూ ఇవ్వలేదు.

బ్యాంక్ బ్యాలన్స్ ఉంది కానీ, ఒక క్రేజీ హీరోకి ఉండాల్సినంత బ్యాంకు బ్యాలన్స్ అయితే కాదు.ఆ సమయం లో నాగ చైతన్య కి ప్రత్యేకంగా సొంత ఇల్లు ఏమి లేదట.ఆ సమయం లో ఆయన హోటల్ రూమ్స్ లో ఉంటూనే షూటింగ్స్ లో పాల్గొనేవాడట.అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక మంచి ఫ్లాట్ లో అద్దెకు దిగాడట.ఆ తర్వాత మంచి సూపర్ హిట్ సినిమాలు పడ్డాయి,డబ్బులు బాగా వచ్చాయి, తన సొంత డబ్బులతో స్నేహితులతో కలిసి ఒక రెస్టారంట్ కూడా పెట్టాడు.

అది కూడా బాగా సక్సెస్ అయ్యింది, అలా కోట్ల రూపాయిలను సంపాదించిన తర్వాత ఈమధ్యనే హైదరాబాద్ లో ఒక విశాలమైన ఫ్లాట్ ని కొనుగోలు చేసి అక్కడ అందమైన ఇల్లుని కట్టడం గత కొంతకాలం క్రితమే ప్రారంభించాడు.అక్కినేని నాగార్జున కొడుకు, దగ్గుపాటి రామానాయుడు మనవడు అయ్యినప్పటికీ కూడా నాగ చైతన్య తన కష్టసమయాలలో ఆ రెండు కుటుంబాల సహాయం కోరలేదు.తన సొంత కాళ్ళ మీదనే నిలబడ్డాడు.ఇది చూసి అభిమానులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు.